క్రికెటర్ తో రకుల్ ప్రీత్ ఆటాపాటా
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లో మంచి ఆటగాడిగానే కాక చక్కటి సంగీతకారుడిగా, అందగాడిగా గుర్తింపు పొందిన బ్రెట్ లీ శనివారం రాత్రి హైదరాబాద్ లో పాటలుపాడుతూ చిందులేశాడు. ఎవరితో?.. ఫొటో చూస్తే అర్థమవుతోంది కదా! అవును. వరుస సినిమాల్లో మంచి నటన, అంతకుమించిన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ తో! అసలు వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా కుదిరిందంటే..
తక్కువ కాలంలో ఎక్కువ సినిమాల్లో నటించి కొద్దోగొప్పో కూడబెట్టుకున్న రకుల్ ప్రీత్ ఆ మధ్య ఓ ఫిట్ నెస్ సెంటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రాంచైంజీలు కలిగిన ఆస్ట్రేలియన్ ఫిట్ నెస్ సంస్థ ఎఫ్ 45లో రకుల్ భాగస్వామి. హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఆమె ప్రారంభించిన జిమ్ ఎఫ్ 45 ప్రాంచైంజీనే. బ్రెట్ లీ కూడా ఎఫ్45 మెంబరే కావడం వీళ్లిద్దరూ కలుసుకునేందుకు దోహదపడిన అంశం.
ఇండియాలో జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తోన్న బ్రెట్ లీని తన ఎఫ్ 45కి రప్పించడం ద్వారా మరింత ప్రచారం లభిస్తుందని భావించింది రకుల్ ప్రీత్. బ్రెట్ లీ, రకుల్ సోదరుడు, ఇంకొంతమంది స్నేహితులు శనివారం రాత్రి పొద్దు పోయేదాకా జిమ్ లోనే గడిపారట. 'బ్రెట్ లీ చేత బాలీవుడ్ పాటలు పాడించుకుని ఆనందించాం'అని రకుల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వీళ్లిద్దరి బంధం ఎంతదకా పోతుందో వేచిచూడాలిమరి!
So guess who joined d f45 family @BrettLee_58 !! n yess v made him sing a lota Hindi songs pic.twitter.com/uctG8LVSgz
— Rakul Preet (@Rakulpreet) 3 April 2016