మరో సినిమాకు అంతా సిద్ధం | Danayya to produce Koratala Siva's next film | Sakshi
Sakshi News home page

మరో సినిమాకు అంతా సిద్ధం

Published Sat, Sep 6 2014 1:11 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

మరో సినిమాకు అంతా సిద్ధం - Sakshi

మరో సినిమాకు అంతా సిద్ధం

‘మిర్చి’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ డెరైక్టర్ అయిపోయారు కొరటాల శివ. మహేశ్‌ని డెరైక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. తనతో సినిమాలు నిర్మించడానికి అగ్ర నిర్మాతలు సైతం ఇప్పుడు ‘సై’ అంటున్నారు. ‘ఆగడు’ తర్వాత మహేశ్-కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య సినిమా చేయడానికి కొరటాల శివ పచ్చజెండా ఊపేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

‘‘ ‘మిర్చి’ విడుదలైనప్పుడే తమ సంస్థకు ఓ సినిమా చేసిపెట్టమని దానయ్య గారు అడిగారు. మహేశ్ సినిమా తర్వాత నేను చేసేది దానయ్యగారి సినిమానే. ఓ అగ్ర హీరో ఇందులో నటిస్తారు. ఆ వివరాలు త్వరలో చెబుతాం’’ అని తెలిపారు. కొరటాల శివ ఓ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారనీ, ఓ అగ్ర కథానాయకుడితో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని డీవీవీ దానయ్య చెప్పారు. యూనివర్సల్ మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement