
దీపికా పదుకొనే ఫోటోలపై దుమారం
ముంబై: బాలీవుడ్ హీరోయిన్‌లు తమ వస్త్రధారణతో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దంగల్ నటి ఫాతిమా ఫాతిమా స్విమ్ సూట్‌పై వివాదం మరువక ముందే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో సన్నీలియోన్ ఫోటో షూట్‌పై దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ దీపికా పుదుకొనే చేరారు.
ఇటీవల ఓ మేగజైన్ కోసం జరిగిన ఫోటోషూట్‌లో దీపికా వస్త్రధారణపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. దీపికా స్వయంగా తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఆ ఫోటోల్లో.. వస్త్రధారణ వల్గర్‌గా, చీప్‌గా ఉందంటూ కామెంట్ల మీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే.. భారతీయ మహిళల పరువుతీసేలా ఆమె వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి కామెంట్లపై దీపికా మాత్రం మౌనంగానే ఉన్నారు.