Hateful Comments
-
దేశాన్ని విభజించే కుట్ర పన్నుతున్నారు
కోల్‌కతా: కొందరు నేతలు విద్వేష రాజకీయాలతో దేశాన్ని విభజించే కుట్రలకు తెరతీశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘వారి కుట్రలను సాగనివ్వను. ఈ పోరాటంలో ప్రాణాలనైనా అర్పిస్తా’’ అని శనివారం కోల్‌కతాలో ఈద్ నమాజ్ సందర్భంగా ఆమె అన్నారు. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. అయినా తలవంచే ప్రసక్తే లేదు’ అన్నారు. ‘‘ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదాం. ఒక్కటిగా ఓటేసి బీజేపీని గద్దె దింపుదాం. ప్రజాస్వామ్య పరిరక్షణలో మనం విఫలమైతే అంతా అయిపోయినట్లే’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఎంలపై ఈ సందర్భంగా మమత విమర్శలు గుప్పించారు. -
ట్విటర్ కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి ట్వీట్లు కనిపించవు..
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఉండే ట్వీట్లకు పరిమితులు వర్తింపచేయనున్నట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్ వెల్లడించింది. ఇకపై రూల్స్‌ను అతిక్రమించే ట్వీట్లను చూపడంపై (విజిబిలిటీ) ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాలసీని అప్డేట్ చేసినట్లు వివరించింది. దీని ప్రకారం ముందుగా, విద్వేషపూరిత ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనిపించే ట్వీట్లను వడగట్టేందుకు ట్విటర్ విజిబిలిటీ ఫిల్టర్‌ను ఉపయోగించనుంది. ఆ తర్వాత ఇతరత్రా విభాగాలకు కూడా దీన్ని విస్తరించనుంది. అభ్యంతరకరమైన ట్వీట్లపై, వాటి విజిబిలిటీ మీద ఆంక్షలు విధించినట్లుగా అందరికీ కనిపించేలా ముద్ర వేస్తారు. అయితే, ఆయా ట్వీట్లను ట్విటర్ తప్పుగా వర్గీకరించిందని వాటిని పోస్ట్ చేసిన యూజర్లు గానీ సంప్రదించిన పక్షంలో పునఃసమీక్షిస్తామని ట్విటర్ పేర్కొంది. అయితే, ట్వీట్ విజిబిలిటీని పునరుద్ధరించేందుకు గ్యారంటీ అంటూ ఉండదని స్పష్టం చేసింది. సాధారణంగా తాము వాక్స్వాతంత్య్రానికి పెద్ద పీట వేస్తామని, సెన్సార్షిప్ భయం లేకుండా తమ అభిప్రాయాలు, ఐడియాలను చెప్పేందుకు యూజర్లందరికీ హక్కులు ఉంటాయని ట్విటర్ తెలిపింది. అదే సమయంలో వారందరికీ కూడా తమ ప్లాట్‌ఫామ్ సురక్షితమైనదిగా ఉండేలా తీర్చిదిద్దేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
మా మీద విద్వేషపూరిత వివక్ష
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాము ధరించే హిజాబ్‌ను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వివక్ష చూపుతోందని కర్ణాటక హైకోర్టులో ముస్లిం విద్యార్థినులు వాదించారు. ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ చట్టవ్యతిరేకమని, ఈ విషయంపై ఎంఎల్ఏ ఆధ్వర్యంలోని కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ(సీడీసీ)కి నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. భారతీయులు లాకెట్లు, శిలువ, బుర్కా, గాజులు, హిజాబ్, బొట్టు, తలపాగా లాంటి పలురకాల మత చిహ్నాలు ధరిస్తారని విద్యార్థినుల తరఫు న్యాయవాది రవి వర్మ కుమార్ చెప్పారు. ఈ పిటీషన్‌ను సీజే జస్టిస్ అవస్తీతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. 1995 విద్యా శాఖ నిబంధనల్లో 11వ నిబంధన ప్రకారం విద్యాసంస్థలు యూనిఫామ్ మార్పుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనీసం ఏడాది ముందు తెలియజేయాలన్నారు. అలాగే ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ గురించి పీయూ విద్యాశాఖ నిబంధనలు ఎక్కడా ప్రస్తావించలేదని కుమార్ చెప్పారు. ఎక్కడా హిజాబ్‌ను నిషేధించాలని లేనప్పుడు ఏ అధికారంతో పిల్లలను క్లాసు నుంచి బయటకు పంపుతున్నారని ప్రశ్నించారు. సీడీసీలను విద్యాప్రమాణాల మెరుగుదల కోసం, నిధుల సక్రమ వినియోగ పర్యవేక్షణ కోసం ఒక సర్క్యులర్ ద్వారా 2014లో ఏర్పాటు చేశారని, ఈ కమిటీకి విద్యార్థుల సంక్షేమంతో సంబంధం లేదని వాదించారు. కమిటీ అధిపతులైన ఎంఎల్ఏకు కార్యనిర్వాహక అధికారాలివ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వాదనల అనంతరం కోర్టు విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో అదే తంతు వారం రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ కాలేజీలు బుధవారం తెరుచుకున్నాయి. అయితే పలు చోట్ల బుర్కా ధరించిన విద్యార్థినులకు కాలేజీల్లోకి ప్రవేశాన్ని నిరాకరించారు. సున్నిత ప్రాంతాల్లోని కాలేజీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలామంది ముస్లిం విద్యార్థినులు బుర్కా తీసివేయడానికి నిరాకరించారు. ఉడిపిలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హిజాబ్‌పై హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ముస్లిం బాలికలు కళాశాలకు హాజరు కాలేదని ప్రిన్సిపాల్ రుద్ర గౌడ చప్పారు. మిగిలిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసివేసి క్లాసులకు హాజరయ్యారని చెప్పారు. కుందాపూర్‌లో హిజాబ్ తీసివేయడానికి నిరాకరించిన 23 మంది విద్యార్థినులు కూడా కాలేజీకి హాజరుకాలేదు. గతవారం గందరగోళం జరిగిన మణిపాల్‌లోని ఎంజీఎం కాలేజీ సహా ఆందోళనలు తలెత్తిన ప్రాంతాల్లో కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం హిజాబ్ తీసివేసిన విద్యార్థినులనే తరగతులకు అనుమతించారు. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు సైతం బుధవారం ఆరంభమయ్యాయి. అయితే వీటిలో ఎలాంటి యూనిఫామ్ నిబంధన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అసెంబ్లీలో వెల్లడించారు. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ యూనిఫామ్ నిబంధన డిగ్రీ కాలేజీలకు వర్తించదని వివరణ ఇచ్చారు. గాజులు మత చిహ్నాలు కాదా? సమాజంలోని భిన్న వర్గాలు భిన్న మత చిహ్నాలు ఉపయోగిస్తాయని, కానీ ప్రభుత్వం కేవలం హిజాబ్‌పై వివక్ష చూపుతోందన్నారు. అలాంటప్పుడు గాజులు మత చిహ్నాల కిందకు రావా? అని న్యాయవాది కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల్లో ఇతర మత చిహ్నాలను వదిలికేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించిన ఆయన కేవలం ముస్లింల విశ్వాసానికి చెందినది కాబట్టే హిజాబ్‌ను వద్దంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ముస్లిం బాలికలపై ఈ వివక్ష 15వ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినకుండా నేరుగా శిక్ష విధించినట్లయిందని, ఇది అమానుషమని వాదించారు. విద్య బహుళత్వాన్ని బోధించాలని, తరగతి గదులు సమాజంలో భిన్నత్వాన్ని ప్రతిబింబించాలని చెప్పారు. -
ఫేస్బుక్ తీరుతో దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న కాంగ్రెస్
-
విద్వేషంపై ఉదాసీనత
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. భారత్‌లోని బీజేపీకి చెందిన కొందరు నేతల విద్వేషపూరిత పోస్టులపై ఫేస్బుక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికా ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’లో వచ్చిన కథనంపై ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై రాజకీయ దుమారం రేపడంతో సోమవారం ఫేస్బుక్ స్పందించింది. హింసను ప్రేరేపించే విద్వేష పూరిత అంశాలను అడ్డుకుంటున్నామని, రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని పాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, తనను కొందరు ఆన్లైన్లో తీవ్రంగా బెదిరిస్తున్నారనీ, ప్రాణహాని ఉందంటూ ఆ సంస్థ ఉన్నతాధికారిణి ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందంటూ ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఒక కథనం వెలువడింది. మత విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యేపై శాశ్వత నిషేధం విధించాలని తీసుకున్న నిర్ణయం భారత్‌లోని తమ ఉన్నతాధికారి జోక్యం కారణంగా ఆగిపోయిందని ఫేస్బుక్ ఉద్యోగులు కొందరు తెలిపారంటూ ఆ కథనంలో పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం స్పందించారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్‌లో ఫేస్బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి’అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో.. విద్వేషాన్ని ప్రేరేపించే వ్యక్తులు లేదా వేదికలను వదలకూడదు. ఫేస్బుక్ నిష్క్రియాపరత్వం ఫలితంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. అభ్యంతరకర అంశాలు ఆ సంస్థ దృష్టికి వచ్చినప్పటికీ కొనసాగించడంతోపాటు ఎలాంటి చర్య తీసుకోకపోవడం హాస్యాస్పదం, ఘోరం’అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర దేశాల్లో వదంతులు సృష్టించే, విద్వేషాలను పెంచే పోస్టులను తొలగించే ఫేస్బుక్.. భారత్‌లో మహిళలపై వేధింపులు, కొన్ని వర్గాలను, మతాలను లక్ష్యంగా చేసుకుని పెట్టే పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విధంగా ఒక్కో దేశానికి ఒక్కో నిబంధనను ఫేస్బుక్ అమలు చేయడం సరికాదని తెలిపారు. ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్‌లోనూ వదంతుల వ్యాప్తి, విద్వేషపూరిత సమాచారంపై అదుపూ లేదన్నారు. ఫేస్బుక్–బీజేపీ కుమ్మక్కు: సీపీఎం విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వాల్‌స్ట్రీట్ కథనంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. అధికార పార్టీ నేతలకు ఫేస్బుక్లో పెట్టుబడులున్నాయనీ, కేంద్రంతో ఆ సంస్థ కుమ్మక్కయిందని సీపీఎం పొలిట్ బ్యూరో ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. నాకు ప్రాణహాని ఉంది: ఫేస్బుక్ అధికారిణి తనకు ప్రాణహాని ఉందని, చంపుతామని బెదిరిస్తూ కొందరు ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారంటూ ఫేస్బుక్ సంస్థ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్ ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ వ్యవహారంపై ఒకపక్క రాజకీయ దుమారం చెలరేగుతుండగా ఆదివారం ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ‘నా జీవితాన్ని నాశనం చేస్తామని, నన్ను చంపుతామంటూ ఆన్లైన్లో నా ఫొటో పెట్టి మరీ బెదిరిస్తున్నారు. వార్తా కథనాన్ని సాకుగా చూపుతూ నా ప్రతిష్టను దెబ్బతీసేలా, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆన్లైన్ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి కారణంగా నాతోపాటు నా కుటుంబసభ్యుల భద్రత ప్రమాదంలో పడింది’అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతలను సైబర్ విభాగానికి అప్పగించినట్లు ఢిల్లీ పోలీస్ విభాగం అదనపు పీఆర్వో అనిల్ మిట్టల్ తెలిపారు. మరింత చేయాల్సి ఉంది: ఫేస్బుక్ వాల్‌స్ట్రీట్ కథనంపై చెలరేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో ఫేస్బుక్ ప్రతినిధి స్పందించారు. ‘విద్వేష ప్రసంగాలను, హింసను ప్రేరేపించే అంశాలను మేం అడ్డుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ లేదా నేతతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఉందని మాకు తెలుసు. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా, కచ్చితత్వంతో ఉండేలా ఆడిట్ చేపట్టాం. ఇది కొనసాగుతుంది’అని తెలిపారు. -
దీపికా పదుకొనే ఫోటోలపై దుమారం
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు తమ వస్త్రధారణతో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దంగల్ నటి ఫాతిమా ఫాతిమా స్విమ్ సూట్‌పై వివాదం మరువక ముందే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో సన్నీలియోన్ ఫోటో షూట్‌పై దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ దీపికా పుదుకొనే చేరారు. ఇటీవల ఓ మేగజైన్ కోసం జరిగిన ఫోటోషూట్‌లో దీపికా వస్త్రధారణపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. దీపికా స్వయంగా తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఆ ఫోటోల్లో.. వస్త్రధారణ వల్గర్‌గా, చీప్‌గా ఉందంటూ కామెంట్ల మీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే.. భారతీయ మహిళల పరువుతీసేలా ఆమె వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి కామెంట్లపై దీపికా మాత్రం మౌనంగానే ఉన్నారు.