
‘వై దిస్ కొలవెరి కొలవెరి ఢీ...’ సాంగ్‌తో సింగర్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించారు హీరో ధనుష్. కొలవెరి పాటకు ముందే ‘పుదుకొటై్టలిరుందు శరవణన్, పుదుపేటై్ట’ సినిమాల్లో పాటలు పాడారు ధనుష్. ఈ రెండు సినిమాల్లో ఆయనే హీరో. తన సినిమాలకే కాకుండా కన్నడలో శివరాజ్‌కుమార్ ‘వజ్రకాయ’, సాయిధరమ్ తేజ్ ‘తిక్క’లో ఓ పాట పాడారు ధనుష్. ఇప్పుడు సూర్య కోసం ఓ పాట పాడనున్నారట ఆయన. సూర్య హీరోగా ధనుష్ సోదరుడు, ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్‌జీకే’. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ సాంగ్ పాడనున్నారు ధనుష్.