ధీవర పాట మేకింగ్ వీడియో విడుదల
భారీస్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న బాహుబలి సినిమాను ఇప్పటికీ జనం నోళ్లలో నానేలా ఉంచేందుకు సరికొత్త ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ అవంతిక (తమన్నా) ఇంట్రడక్షన్ పాట అయిన 'ధీవర' మేకింగ్ వీడియోను టీం బాహుబలి విడుదల చేసింది.
దాని లింకును ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముందుగానే బుధవారం సాయంత్రం ఈ మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన బాహుబలి బృందం.. అన్నట్లుగానే ఈ పాట ఎలా షూట్ చేశారో చూపించే వీడియోను ఇచ్చారు.
Here's the making of #Dheevara - Behind the scenes of #Baahubali. - http://t.co/hGd29NK3nQ
— Baahubali (@BaahubaliMovie) July 29, 2015