baahubali movie
-
ఆ సినిమా నన్ను ఎక్కడికో తీసుకొని పోయింది కానీ ఇప్పుడు..!
-
బాహుబలి ఛాన్స్ వచ్చింది, కానీ రాజమౌళి..: రాశీఖన్నా
చూడగానే బబ్లీగా కనిపించే రాశీఖన్నా ఎక్కువగా జాలీగా ఉండే పాత్రల్లోనే మెరిసింది. తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఆమె యోధతో బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు రెడీ అయింది. నిజానికి మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్లో సెటిలైపోయింది. మధ్యమధ్యలో మలయాళ, తమిళ చిత్రాలు కూడా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను నటించిన మద్రాస్ కెఫె సినిమా అయిపోయాక రాజమౌళి సర్ బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ జరిగింది. నాకు పిలుపొచ్చింది, వెళ్లాను. కానీ రాజమౌళి సర్ నన్ను చూసి చాలా క్యూట్‌గా ఉందీ అమ్మాయి, ఏదైనా లవ్ స్టోరీకి బాగా సెట్టవుతుంది అన్నాడు. నా స్నేహితుడొకరు మంచి ప్రేమకథపై వర్క్ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను, నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. అలా ఊహలు గుసగుసలాడేతో నేను తెలుగులో లాంచ్ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్రైనా చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. -
శివగామి పాత్రను ఆమె ఎందుకు వద్దంది?
వెయ్యికోట్లకు పైగా కలెక్షన్లు సాధించే దిశగా దూసుకెళ్లిపోతున్న బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. రెండు భాగాల్లోను కూడా హీరో, విలన్లతో సమాన స్థాయిలో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రలో రమ్యకృష్ణ జీవించారు. ఆమె తమ సినిమాకు ఓ ఎసెట్ అని స్వయంగా రాజమౌళి కూడా చెప్పారు. అయితే.. అసలు మొదట్లో ఈ పాత్రకు ఇటు సౌత్, అటు నార్త్ ఇండియాలు రెండింటిలోనూ మంచి పేరున్న అలనాటి టాప్ హీరోయిన్ శ్రీదేవిని తీసుకుందామని అనుకున్నారట. రీఎంట్రీకి ఇది చాలా మంచి అవకాశం అవుతుందని అందరూ ఎంతలా చెప్పినా ఆమె మాత్రం ఈ పాత్ర చేయడానికి ససేమిరా అన్నారని తెలిసింది. సినిమా పెద్దదని తెలుసు, భారీ విజయం సాధించే అవకాశం ఉంటుందని కూడా తెలుసు. అయినా ఇంత పెద్ద సినిమాలో అంత ముఖ్యమైన పాత్ర పోషించడానికి శ్రీదేవి ఎందుకు నిరాకరించారంటే.. అందుకు ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది.. ప్రభాస్ అంత పెద్ద కొడుక్కి తాను తల్లిగా చేయడం ఏంటని ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం. రెండోది.. కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ అడగడం. ఈ రెండింటిలో అసలైన కారణం ఏదైనా శ్రీదేవి మాత్రం గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యిందంటూ బాలీవుడ్ నటీనటులు, దర్శకులు ఇప్పుడు చెబుతున్నారు. హిందీ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా రికార్డులను బద్దలు కొడుతున్న బాహుబలి లాంటి సినిమాలో ఎంత చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా కళ్లు మూసుకుని సరేనంటారు. రెండో భాగంలో తనకు మంచి అవకాశం ఇచ్చినందుకు సుబ్బరాజు కూడా ఆడియో రిలీజ్ సమయంలో దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. హాస్యనటుడు పృథ్వి చాలా కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. ఇలా ఎంతోమంది అంత పెద్ద సినిమా కాబట్టి తాము ఏదో ఒక పాత్ర చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ శివగామి లాంటి అత్యంత కీలకమైన పాత్ర పోషించే అవకాశం వచ్చినా.. శ్రీదేవి దాన్ని వదులుకోవడం చాలా పెద్ద పొరపాటని అంటున్నారు. -
రాజమౌళి మాట్లాడారు..!
బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున సమయం సరిపోక దర్శకుడు రాజమౌళి తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పలేకపోయారు. దాంతో అప్పుడు తాను అనుకున్న మాటలన్నింటినీ ట్విట్టర్లో వరుసపెట్టి రాసేశారు. సాంకేతిక సిబ్బంది గురించి వేదికపై పూర్తిగా చెప్పిన రాజమౌళి, నటీనటుల గురించి మాత్రం పెద్దగా ప్రస్తావించలేకపోయారు. దాంతో ఎవరెవరి గురించి అనుకున్నారో.. అన్నింటినీ పేర్కొన్నారు. ముందుగా ఎంత ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, చాలా మర్యాదపూర్వకంగా అందరినీ హ్యాండిల్ చేసిన జీ4ఎస్ హైదరాబాద్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ మేనేజర్లు అయిన గౌతమ్, విజ్‌క్రాఫ్ట్ మీడియా ఈ కార్యక్రమానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, చాలా విజయవంతం చేసినందుకు వాళ్లకు థాంక్స్ చెప్పారు. గత ఐదేళ్లుగా సమయం సందర్భం లేకుండా తాను ఏం అడిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే అందించిన యోగానంద్, ఆయన బృందానికి ధన్యవాదాలు తెలిపారు. వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ వాళ్లయితే అసలు వాళ్ల పని కాకుండా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లుగా చేశారని, ఈ త్రిశంకు స్వర్గం నుంచి చాలా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారని అన్నారు. బాహుబలి చిత్రంలో చేసినందుకు చాలా థాంక్స్ అంటూ స్వీటీ అనుష్కను పొగడ్తలలో ముంచెత్తారు. మొదటి భాగంలో డీ గ్లామరైజ్డ్గా చూపించడంతో, రెండో భాగంలో తనను చూసి అభిమానులు చాలా ఆనందపడతారన్నారు. ఇక చివరి రోజు షూటింగ్ అప్పుడు తాను పెద్దగా భావోద్వేగానికి గురి కాలేదని, కానీ ఆ విషయాన్ని రానా వేదిక మీద తన ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు మాత్రం అది ఒక్కసారిగా ఉబికి వచ్చిందని, డ్యాం ఫ్లడ్ గేట్లు ఎత్తేసినట్లుగా అయ్యిందని చెప్పారు. తాను రానాను ఎంతగానో మిస్సవుతానని, తన భల్లాలదేవుడిగా చేసినందుకు లక్షల థాంక్స్ అని రాజమౌళి చెప్పారు. ఇక ప్రభాస్ గురించి చెప్పడానికి మాటలు రావట్లేదని, అతడే ఎందుకు బాహుబలి అయ్యాడో, బాహుబలిలో అతడేంటో తన ఇంటర్వ్యూలలో వివరిస్తానన్నారు. బాహుబలి2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినందుకు కరణ్ జోహార్, అనిల్ తడానీలకు కృతజ్ఞతలు చెప్పారు. వాళ్లతో అనుబంధం చాలా గొప్పగా ఉందన్నారు. ఇక అన్నింటికంటే చివరగా చెప్పినా.. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవుడిని అయితే రాజమౌళి ఆకాశానికి ఎత్తేశారు. చిన్నప్పుడు అతడిని తన చేతులతో ఎత్తుకున్నానని, ఇప్పుడు దండాలయ్యా పాటను పెద్దన్న (కీరవాణి) కంటే కూడా బాగా పాడాడని అంటూ ఆ పాట యూట్యూబ్ లింకును ట్వీట్ చేశారు. Because of the time constraint yesterday, i couldn't say about few of our cast and crew whom I wanted to mention. — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 Thank you G4S Hyderabad team for your excellent security services in handling massive crowd in the most courteous manner. — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 Gautam and @WizcraftIndia team, thank you for your planning and execution which made the event so successful. — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 Thank you Yoganand garu and your team of managers for organising me whatever I needed irrespective of timings over the last 5 years... — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 VFX team thinks you are from dir dept and we consider u in vfx dept. But thanks Ram, for operating wonderfully from this trisanku swargam.. — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 Sweetu...thank u so much for ur contribution to Baahubali. I believe all your fans will be even more enthralled with your presence in Part2. — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 Rana i was surprised that i didnt feel emotional on the last day of our shoot. Your speech yesterday triggered it and was like — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 opening the flood gates of a dam. Will Miss you. Thanks a million for being my Bhallaladeva...:) — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 I am not able to frame my words for prabhas here.. my interviews will explain what he is to Baahubali.. why he is BAAHUBALI... — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 Thank you @KaranJohar & Anil Thadani for gracing our #Baahubali2PrereleaseEvent last night.. and for a great association.. — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 I carried him in my arms since he was an infant. Today when i see my @kaalabhairavudu being praised that he sang better than peddanna, — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 the pride is unexplainable....https://t.co/M2dlqZjvHO — rajamouli ss (@ssrajamouli) 27 March 2017 -
బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.
-
బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
-
బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
హైదరాబాద్ : టాలీవుడ్‌కు ఐటీ షాక్ తగిలింది. సినీ ప్రముఖులపై మరోసారి ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. బాహబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆర్కా మీడియా ఆఫీస్‌తో పాటు ఇళ్లు, కార్యాలయాలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో మెరుపు దాడులకు దిగిన అధికారులు తొలుత ఉద్యోగాలను బయటకు పంపించారు. అనంతరం అణువణువు గాలించారు. అక్కడ దొరికిన రికార్డులు, ఫైల్స్ , డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ట్యాక్స్ కడుతున్నారా లేదా అనే దానిపై ఆరా తీశారు. ప్రతిఏటా జరుగుతున్న ఆడిట్ సరిగా ఉందా లేదా అనేదాన్ని కూడా గుర్తించారు. పలు భాషల్లో రిలీజైన బాహుబలి చిత్చిత్రం ప్రేక్షాకదరణ పొందింది. బాహుబలి తొలి భాగానికి దాదాపు 180 కోట్లు పెట్టుబడి పెడితే రూ.600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక షూటింగ్లో ఉండగానే బాహుబలి-2ను ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు పంపిణీ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే... ఐటీ అధికారులు దాడులు చేశారు. కాగా ఐటీ దాడులపై ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ... మీడియాలో న్యూస్ కోసమే నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ దాడులు చేసిందన్నారు. ఐటీ అధికారులు టైమ్ పాస్ కోసమే దాడులు చేశారని, నిర్మాతలు సినిమాలపై ఖర్చు పెడతారే కానీ, ఇళ్లల్లో డబ్బులు పెట్టుకోరని అన్నారు. -
ఆ హిమక్రీము అంటే చాలా ఇష్టం!
యమలోకం నుంచి యమధర్మ రాజు భూలోకానికి రావడం ఏంటి? పోనీ వచ్చారే అనుకుందాం.. ఐస్‌క్రీమ్ లాగించడం ఏంటి? లాగించారే అనుకుందాం.. దానికి ‘హిమక్రీము’ అని కొత్త పేరు పెట్టడం ఏంటి? చిన్నపిల్లాడిలా ఆ హిమక్రీముని ఫన్నీగా చప్పరించడం ఏంటి? రియల్ లైఫ్‌లో సాధ్యం అనిపించని ఇలాంటి సంఘటనలను రీల్‌పై చూసినప్పుడు భలే సరదాగా ఉంటుంది. ఇదంతా చదువుతుంటే, ‘యమలీల’ సినిమాలో కైకాల సత్యనారాయణ గుర్తొస్తున్నారు కదూ. ఐస్‌క్రీమ్‌ని ఆ తర్వాత సరదాగా హిమక్రీము అంటుంటాం. సరే.. ఆరడుగుల కైకాల ఆ సినిమాలో ఐస్‌క్రీములను ఇష్టపడ్డారు. మరి.. ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కి హిమక్రీములు ఇష్టమేనా? ఇష్టమేనట. కానీ, కండలు తిరిగిన దేహం కోసం ఇష్టమైన వాటిని త్యాగం చేయాలి కదా. అందుకే మన యంగ్ రెబల్ స్టార్ ఐస్క్రీమ్స్కి దూరంగా ఉంటారు. కానీ, ఒకే ఒక్క రోజు మాత్రం నో డైటింగ్. ఆ రోజు పెద్ద పెద్ద కప్పులు ఐస్‌క్రీమ్ లాగించేస్తారట. ‘‘ఏడాదిలో దాదాపు అన్ని రోజులూ నేను డైటింగ్ చేస్తా. ఎప్పుడైనా ఒకరోజు హాలిడే ఇస్తా. ఆ రోజు మాత్రం ఐస్‌క్రీమ్ తింటా’’ అని ప్రభాస్ అన్నారు. ఇంతకీ ప్రభాస్ ఫేవరెట్ ఐస్‌క్రీమ్ ఏంటో తెలుసా? ‘ఫ్రూట్ ఎగ్జాటికా’ అట. అదెలా ఉంటుందో అంటున్నారా? గూగుల్ సహాయం తీసుకోండి మరి. ఆ సంగతలా ఉంచితే.. కప్పుల మీద కప్పులు ఐస్‌క్రీమ్ లాగించేస్తే, కేలరీలు పెరిగిపోతాయ్ కదా.. ‘‘అందుకే మర్నాడు ఎక్స్ర్జైస్ డోస్ పెంచుతా’’ అంటున్నారు ప్రభాస్. -
బకెట్ ఐస్‌క్రీం లాగించిన బాహుబలి!
బాహుబలి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక.. కలెక్షన్ల వర్షం కూడా కురిపించిన హీరో ప్రభాస్. కండలు కనిపించడం కోసం డార్లింగ్ ప్రభాస్ చాలా కష్టపడతాడు. అలాగే తన ఆహారపు అలవాట్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. మామూలు రోజుల్లో ఫ్యాటీ ఆహారానికి చాలా దూరంగా ఉంటాడు గానీ.. మధ్యమధ్యలో మాత్రం ఐస్‌క్రీం కనిపిస్తే ఊరుకోడు. ఒక్కొసారి మాత్రం బకెట్ ఐస్‌క్రీం అయినా లాగించేస్తానని స్వయంగా చెబుతున్నాడీ బాహుబలి. కానీ, ఆ ఒక్కరోజు తిన్నందుకు రోజూ మామూలుగా చేసేకంటే ఎక్కువ వర్కవుట్లు చేస్తాడట. ఐస్‌క్రీం తిని పెంచుకున్న కేలరీలను కరిగించడానికి చాలా చాలా కష్టపడి జిమ్‌లో గడుపుతాడు. ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగులో పాల్గొంటున్నాడు కాబట్టి, ఫిజిక్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుందని అంటున్నాడు. -
బాహుబలి యూనిట్‌కు వైఎస్ జగన్ అభినందనలు
జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రం అవార్డుతో పాటు ఉత్తమ స్పెషల్ ఎఫెక్టులకు కూడా అవార్డు గెలుచుకున్న బాహుబలి చిత్రయూనిట్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని పొందడం తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణం, గౌరవం అని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగేలా మరిన్ని నాణ్యమైన సినిమాలను తెలుగు సినీ పరిశ్రమ నిర్మిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాహుబలి చిత్ర దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. -
భుజానికి ఆపరేషన్ చేయించుకుని.. ఆ షాట్!
బాహుబలి సినిమాలో నీళ్ల కొండ మీద ఉన్న అందాల సుందరిని అందుకోడానికి శివుడు చాలా సాహసాలు చేస్తాడు. బాణానికి తాడు కట్టి.. దాన్ని ఓ చెట్టుకు గురిచూసి కొట్టి, ఆ తాడు సాయంతో తొలుత వేలాడుతూ.. ఆ తర్వాత నెమ్మదిగా నీళ్లకొండ మీదకు చేరుకుంటాడు. ఎంత గ్రాఫిక్స్ సాయంతో తీసినా.. అంత పెద్ద కొండ కాకపోయినా.. తాళ్ల సాయంతో కాసేపు గాలిలో అటూ ఇటూ ఊగడం, తాడుతో పైకి ఎక్కడం మాత్రం హీరో ప్రభాస్‌కు తప్పలేదు. వెనకాల వైర్లు ఉంటాయి కదా అనుకుంటారా? కానీ ఆ షాట్ తియ్యడానికి కొద్ది రోజుల ముందే ప్రభాస్ తన భుజానికి ఓ శస్త్ర చికిత్స చేయించుకున్నాడట. దాంతో, ఆ షాట్ చేయిస్తుంటే సినిమా యూనిట్ మొత్తం అలా చూస్తూ ఉండిపోయిందని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. తాజాగా ఆయనీ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. షాట్ ముగియగానే అందరూ చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారట. The whole unit went into a thunderous applause when he did this shot. And this was right after his shoulder surgery https://t.co/ZXUKzScwLj — rajamouli ss (@ssrajamouli) September 9, 2015 -
‘బాహుబలి’ కత్తిరింపును ప్రదర్శించొద్దు
మదురై: ‘బాహుబలి’ సినిమా తమిళ వెర్షన్‌లోని సెన్సార్ బోర్డు తొలగించిన కుల ప్రస్తావన భాగాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము జారీ చేసిన ఆర్డర్ కాపీని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుండా సినిమా ప్రదర్శిస్తే ధియేటర్ల యాజమానులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆర్డర్ కాపీని తమకు కూడా పంపాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. తమిళ పులి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సి పెరారీవలన్ తో పాటు ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ‘బాహుబలి’లో కొన్ని సంభాషణలు అరుంధతీయ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ తమిళనాడులో ఆందోళనలు జరిగాయి. మధురైలో బాహుబలి సినిమా పదర్శిస్తున్న ధియేటర్ పై తమిళపులి సంస్థకు చెందిన కార్యకర్తలు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. దీంతో మాటల రచయిత మదన్ కార్గి క్షమాపణ చెప్పారు. ఈ సంభాషణలను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకటించారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి’రూ. 500 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. -
ధీవర పాట మేకింగ్ వీడియో విడుదల
భారీస్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న బాహుబలి సినిమాను ఇప్పటికీ జనం నోళ్లలో నానేలా ఉంచేందుకు సరికొత్త ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ అవంతిక (తమన్నా) ఇంట్రడక్షన్ పాట అయిన 'ధీవర' మేకింగ్ వీడియోను టీం బాహుబలి విడుదల చేసింది. దాని లింకును ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముందుగానే బుధవారం సాయంత్రం ఈ మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన బాహుబలి బృందం.. అన్నట్లుగానే ఈ పాట ఎలా షూట్ చేశారో చూపించే వీడియోను ఇచ్చారు. Here's the making of #Dheevara - Behind the scenes of #Baahubali. - http://t.co/hGd29NK3nQ — Baahubali (@BaahubaliMovie) July 29, 2015 -
వారి కోసం 'బాహుబలి' స్పెషల్ షో
హైదరాబాద్ : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'బాహుబలి' చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు తిలకించారు. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ సినిమాను గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. కాగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న బాహుబలి సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. -
సెప్టెంబర్ 15 నుంచి 'బాహుబలి 2' షూటింగ్
చెన్నై: 'బాహుబలి' రెండో భాగం షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి జరగనుందని హీరో ప్రభాస్ తెలిపారు. తమ సెలవులన్ని ముగించుకుని సెప్టెంబర్ 15 చిత్రీకరణలో పాల్గొంటామని చెప్పాడు. రెండోభాగం షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందని ప్రభాస్ తెలిపారు. యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉందని వెల్లడించాడు. 'బాహుబలి ది కన్ క్లూజన్' పేరుతో రెండో భాగం తెరకెక్కించనున్నారు. ఇందులో దగ్గుబాటి రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. జూలై 10న విడుదలైన 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు రూ.350 కోట్లు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. -
బాహుబలికి గిన్నిస్ రికార్డు
దేశమంతటా అందరి దృష్టినీ ఆకర్షించిన ‘బాహుబలి’ చిత్రం వసూళ్ళతో పాటు ఇప్పుడు మరో విషయంలోనూ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టర్ రికార్డ్ కింద ‘బాహుబలి’ చిత్ర ప్రయత్నం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కినట్లు గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు బుధవారం ప్రకటించారు. ఆ సంగతి చిత్ర దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. నిజానికి, సినిమా రిలీజ్‌కు ముందు పబ్లిసిటీ వ్యూహంలో భాగంగా కేరళలోని కొచ్చిలో జూన్ 27న ఈ చిత్రం తాలూకు అతి భారీ పోస్టర్‌ను ప్రదర్శించారు. మొత్తం 4,793.65 చదరపు మీటర్ల (51,598.21 చదరపుటడుగుల) విస్తీర్ణమున్న ఈ భారీ పోస్టర్‌ను చిత్రం మలయాళ డబ్బింగ్ వెర్షన్ పంపిణీ హక్కులు తీసుకున్న గ్లోబల్ యునెటైడ్ మీడియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బృందం రూపొందించింది. రికార్డ్ కోసం చేసిన అప్పుడు చేసిన ప్రయత్నానికి ఇప్పుడు అధికారిక గుర్తింపు లభించింది. -
'మాస్టర్ పీస్' అంటున్నారు!
హైదరాబాద్: భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రతిష్టాత్మక సినిమా 'బాహుబలి' అభిమానులను అలరిస్తోంది. సినిమా చూసిన వారందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'మాస్టర్ పీస్' అంటూ పొగిడేస్తున్నారు. రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తీశాడంటూ ప్రశంసిస్తున్నారు. పాత్రలు వేటికవే సాటిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యపాత్రధారులు విశ్వరూపం చూపించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ గొప్పగా నటించారని చెబుతున్నారు. అవంతికగా తమన్నా ఒదిగిపోయిందని అంటున్నారు. హీరో ప్రభాస్, విలన్ దగ్గుబాటి రానా పోటీపడీ నటించారని తెలిపారు. క్లైమాక్స్ లో 45 నిమిషాలు సాగిన యుద్ధసన్నివేశాలు హైలెట్ గా నిలిచాయని తెలిపారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ రేంజ్ లో ఉన్నాయన్నారు. ఇక సినిమా ప్రముఖులు కూడా మాస్టర్ పీస్ అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తే 'బాహుబలి' భారీ హిట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
బాహుబలి మూవీ స్టిల్స్
-
బాహుబలికి సెన్సార్ ప్రశంసలు
బ్రహ్మాండానికే బ్రహ్మాండం అనిపించే రీతిలో ఇండియన్ సెల్యులాయిడ్ గర్వపడే విధంగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా తెర కెక్కిన ఈ చిత్రానికి సృష్టికర్త రాజమౌళి. ప్రభాస్, రాణా, అనుష్క, తమన్న, రమ్యక్రిష్ణ, సుధీప్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి భారతీయ సాంకేతిక నైపుణ్యంతో హాలీవుడ్ సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం సెన్సార్ సభ్యుల్ని కూడా అబ్బుర పరిచిందట. బాహుబలి చిత్రాన్ని సెన్సార్ చేయడమే గర్వంగానూ, గొప్ప అవకాశంగానూ భావిస్తున్నట్లు సెన్సార్ బోర్డు సభ్యులు పేర్కొన్నట్లు చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ అదినేత కేఈ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. బాహుబలి చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయడం గర్వంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ చిత్రం తమ సంస్థలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 10న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.