బ్రహ్మాండానికే బ్రహ్మాండం అనిపించే రీతిలో ఇండియన్ సెల్యులాయిడ్ గర్వపడే విధంగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా తెర కెక్కిన ఈ చిత్రానికి సృష్టికర్త రాజమౌళి. ప్రభాస్, రాణా, అనుష్క, తమన్న, రమ్యక్రిష్ణ, సుధీప్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి భారతీయ సాంకేతిక నైపుణ్యంతో హాలీవుడ్ సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం సెన్సార్ సభ్యుల్ని కూడా అబ్బుర పరిచిందట.
బాహుబలి చిత్రాన్ని సెన్సార్ చేయడమే గర్వంగానూ, గొప్ప అవకాశంగానూ భావిస్తున్నట్లు సెన్సార్ బోర్డు సభ్యులు పేర్కొన్నట్లు చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ అదినేత కేఈ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. బాహుబలి చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయడం గర్వంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ చిత్రం తమ సంస్థలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 10న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాహుబలికి సెన్సార్ ప్రశంసలు
Published Mon, Jul 6 2015 2:15 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM
Advertisement
Advertisement