బాహుబలి సినిమాలో నీళ్ల కొండ మీద ఉన్న అందాల సుందరిని అందుకోడానికి శివుడు చాలా సాహసాలు చేస్తాడు. బాణానికి తాడు కట్టి.. దాన్ని ఓ చెట్టుకు గురిచూసి కొట్టి, ఆ తాడు సాయంతో తొలుత వేలాడుతూ.. ఆ తర్వాత నెమ్మదిగా నీళ్లకొండ మీదకు చేరుకుంటాడు. ఎంత గ్రాఫిక్స్ సాయంతో తీసినా.. అంత పెద్ద కొండ కాకపోయినా.. తాళ్ల సాయంతో కాసేపు గాలిలో అటూ ఇటూ ఊగడం, తాడుతో పైకి ఎక్కడం మాత్రం హీరో ప్రభాస్కు తప్పలేదు.
వెనకాల వైర్లు ఉంటాయి కదా అనుకుంటారా? కానీ ఆ షాట్ తియ్యడానికి కొద్ది రోజుల ముందే ప్రభాస్ తన భుజానికి ఓ శస్త్ర చికిత్స చేయించుకున్నాడట. దాంతో, ఆ షాట్ చేయిస్తుంటే సినిమా యూనిట్ మొత్తం అలా చూస్తూ ఉండిపోయిందని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. తాజాగా ఆయనీ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. షాట్ ముగియగానే అందరూ చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారట.
The whole unit went into a thunderous applause when he did this shot. And this was right after his shoulder surgery https://t.co/ZXUKzScwLj
— rajamouli ss (@ssrajamouli) September 9, 2015