
బకెట్ ఐస్‌క్రీం లాగించిన బాహుబలి!
బాహుబలి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక.. కలెక్షన్ల వర్షం కూడా కురిపించిన హీరో ప్రభాస్. కండలు కనిపించడం కోసం డార్లింగ్ ప్రభాస్ చాలా కష్టపడతాడు. అలాగే తన ఆహారపు అలవాట్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. మామూలు రోజుల్లో ఫ్యాటీ ఆహారానికి చాలా దూరంగా ఉంటాడు గానీ.. మధ్యమధ్యలో మాత్రం ఐస్‌క్రీం కనిపిస్తే ఊరుకోడు.
ఒక్కొసారి మాత్రం బకెట్ ఐస్‌క్రీం అయినా లాగించేస్తానని స్వయంగా చెబుతున్నాడీ బాహుబలి. కానీ, ఆ ఒక్కరోజు తిన్నందుకు రోజూ మామూలుగా చేసేకంటే ఎక్కువ వర్కవుట్లు చేస్తాడట. ఐస్‌క్రీం తిని పెంచుకున్న కేలరీలను కరిగించడానికి చాలా చాలా కష్టపడి జిమ్‌లో గడుపుతాడు. ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగులో పాల్గొంటున్నాడు కాబట్టి, ఫిజిక్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుందని అంటున్నాడు.