బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
బాహుబలి నిర్మాతల నివాసాలపై ఐటీ దాడులు
Published Fri, Nov 11 2016 4:38 PM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM
హైదరాబాద్ : టాలీవుడ్‌కు ఐటీ షాక్ తగిలింది. సినీ ప్రముఖులపై మరోసారి ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. బాహబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆర్కా మీడియా ఆఫీస్‌తో పాటు ఇళ్లు, కార్యాలయాలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
మధ్యాహ్న సమయంలో మెరుపు దాడులకు దిగిన అధికారులు తొలుత ఉద్యోగాలను బయటకు పంపించారు. అనంతరం అణువణువు గాలించారు. అక్కడ దొరికిన రికార్డులు, ఫైల్స్ , డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ట్యాక్స్ కడుతున్నారా లేదా అనే దానిపై ఆరా తీశారు. ప్రతిఏటా జరుగుతున్న ఆడిట్ సరిగా ఉందా లేదా అనేదాన్ని కూడా గుర్తించారు.
పలు భాషల్లో రిలీజైన బాహుబలి చిత్చిత్రం ప్రేక్షాకదరణ పొందింది. బాహుబలి తొలి భాగానికి దాదాపు 180 కోట్లు పెట్టుబడి పెడితే రూ.600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక షూటింగ్లో ఉండగానే బాహుబలి-2ను ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు పంపిణీ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే... ఐటీ అధికారులు దాడులు చేశారు.
కాగా ఐటీ దాడులపై ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ... మీడియాలో న్యూస్ కోసమే నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ దాడులు చేసిందన్నారు. ఐటీ అధికారులు టైమ్ పాస్ కోసమే దాడులు చేశారని, నిర్మాతలు సినిమాలపై ఖర్చు పెడతారే కానీ, ఇళ్లల్లో డబ్బులు పెట్టుకోరని అన్నారు.
Advertisement