
బిగ్ బీ పక్కన ఈ బాలుడెవరో గుర్తించారా..?
ముంబయి: ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఉన్నవారిని గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోవడమేమిటీ.. ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అని టక్కున చెప్తారు.. మరి పక్కన కూర్చున్నదెవరబ్బా అని ఆలోచనలో కూడా పడతారు. కొందరైతే.. బహుషా బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చనేమో అని అనుకుంటారు. ఇంకొందరైతే షూటింగ్కు వెళ్లిన సమయంలో అమితాబ్ తో ఫొటో దిగేందుకు ముచ్చటపడిన ఎవరో అబ్బాయేమో అని భావిస్తారు.
అయితే, అది నిజమే.. ఈ కుర్రాడు నిజంగానే అమితాబ్ బచ్చన్కు పెద్ద ఫ్యాన్. ఇప్పటికీ ఆయనంటే ఎంతో గౌరవం, ప్రేమ. అమితాబ్కు సంబంధించిన ప్రతి అంశాన్ని పంచుకుంటుంటాడు. ఇంతకీ ఎవరు ఆ కుర్రాడు అనేగా మీ అనుమానం. ఆ కుర్రాడు మరెవరో కాదు.. ప్రస్తుతం బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకొని అమితాబ్ చే షబాష్ అనిపించుకుంటున్న హృతిక్ రోషన్. ఈ ఫొటోలో ఉన్న బాలుడిని మీరు గుర్తు పట్టగలరా అంటూ అమితాబ్తో తాను చిన్నతనంలో దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు హృతిక్.