
దిశా పాట్నీ
సర్కస్‌లో ట్రాపెజ్ ఆర్టిస్ట్‌లను (తాడుతో వేళాడుతూ స్టంట్స్ చేసేవాళ్లు) చూసి చప్పట్లు కొడతాం. చాలా ఏళ్ల శ్రమ ఉంటే తప్ప పర్ఫెక్ట్ టైమింగ్‌తో అలాంటి స్టంట్స్ చేయలేరు ట్రాపేజ్ ఆర్టిస్ట్‌లు. ఇదంతా ఎందుకంటే దిశా పాట్నీ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భారత్’లో సర్కస్‌లో ట్రాపెజ్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు కాబట్టి. ఈ క్యారెక్టర్ కోసం దిశా రోజూ ఆరు గంటలకు పైనే ప్రాక్టీస్ చేస్తున్నారట. సంవత్సరాల కొద్దీ ప్రాక్టీస్‌తో వచ్చే పర్ఫెక్షన్‌ను ఆమె కేవలం కొన్ని నెలల ప్రాక్టీస్‌తో సాధిస్తున్నారట. క్యారెక్టర్ పట్ల ఆమెకున్న డెడికేషన్ చూసి దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కూడా ఆశ్చర్యపోయారట. దాంతో ఈ సీక్వెన్స్ షూట్ చేయడానికి వేరే దేశం నుంచి ఆర్టిస్ట్‌లను కూడా తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నారట ఆయన.
Comments
Please login to add a commentAdd a comment