
.. అంటూ దిశా పాట్నీని ఆహ్వానించారు సల్మాన్ ఖాన్. ‘భాగీ 2’ సూపర్ సక్సెస్‌తో మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పాట్నీ. ఇప్పుడు సల్మాన్‌ఖాన్ లేటెస్ట్ మూవీ ‘భర త్’ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారీ బ్యూటీ. సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా జంటగా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రూపొందిస్తున్న పీరియాడికల్ మూవీ ‘భరత్’. కొరియన్ మూవీ ‘ఓడ్ టూ మై ఫాదర్’కు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సర్కస్‌లో ట్రాపెజ్ కళాకారిణిగా కనిపించనున్నారు.
1960లో జరిగే సర్కస్ ఎపిసోడ్‌లో వచ్చే సీన్స్‌లో సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేయనున్నారట దిశా. ‘‘భరత్’ జర్నీకి వెల్కమ్ దిశా పాట్నీ’ అని ట్వీటర్‌లో సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. సల్మాన్‌తో కలసి యాక్ట్ చేసే అవకాశం గురించి దిశా మాట్లాడుతూ– ‘‘భరత్’ టీమ్‌లో భాగం అవుతున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేయాలనే కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నాను. దర్శకుడు అలీ జాఫర్ వర్క్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రంజాన్ స్పెషల్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment