
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి భారత్ మూవీలో ఆడిపాడిన నటి దిశా పటానీ మరోసారి సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించకపోవచ్చని అన్నారు. భారత్‌లో తమ మధ్య కెమిస్ర్టీ చక్కగా కుదిరిందని తమ ఆన్‌స్క్రీన్ కెమిస్ర్టీకి ఆడియన్స్ ఫిదా అవుతారని చెప్పుకొచ్చారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ 20, 30 ఏళ్ల యువకుడిగా ఉన్న సందర్భంలో వచ్చే పాటలో తాను ఆయన సరసన డాన్స్ సీక్వెన్స్‌లో నటించానని అందుకే సీనియర్ నటుడైన సల్మాన్‌తో పనిచేసేందుకు తాను సంతోషంగా అంగీకరించానని తెలిపారు.
తమ ఇద్దరి మధ్య ఉన్న వయోభేదం కారణంగా మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు రాకపోవచ్చని చెప్పారు. భారత్ మూవీ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ సైతం ఇదే విషయం తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ఐదు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించే భారత్ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment