ప్రేమలోకంలో విహారించే ‘మనసును మాయ సేయకే’ | Disha Pandey's 'Manasunu Maaya Seyake' Latest Telugu Movie | Sakshi
Sakshi News home page

ప్రేమలోకంలో విహారించే ‘మనసును మాయ సేయకే’

Published Fri, Aug 9 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

ప్రేమలోకంలో విహారించే ‘మనసును మాయ సేయకే’

ప్రేమలోకంలో విహారించే ‘మనసును మాయ సేయకే’

ఆ ఇద్దరి చూపులు కలిశాయి. మనసులు కూడా కలిశాయి. ఇంకేముంది? ప్రేమలోకంలో విహరించడం మొదలుపెట్టారు. ఆ ప్రేమను మూడు ముళ్ల బంధంతో సఫలం చేసుకోవాలనుకున్నారు. కానీ, కథ వేరే మలుపు తిరిగింది. ఆ మలుపు ఎలాంటిది? దానివల్ల ఆ యువతీయువకుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మనసును మాయ సేయకే’. 
 
 ప్రిన్స్, రిచా పనయ్, దిశా పాండే, సేతు ముఖ్య తారలుగా ఫుల్‌హౌస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సురేష్ పి. కుమార్ దర్శకుడు. జైసన్ పులికొట్టిల్, విన్స్ మాంగడన్ నిర్మాతలు. మణికాంత్ కద్రి స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 14న విడుదల చేయాలనుకుంటున్నారు. 
 
 ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటివరకు ప్రిన్స్ నటించిన అన్ని సినిమాల్లోకల్లా ఈ చిత్రానికి శాటిలైట్ హక్కులను మంచి ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సవ్యసాచి శ్రీనివాస్, కెమెరా: వెంకట్ హనుమ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement