
సోషల్ మీడియాలో హీరోయిన్ దిశా పాట్నీ పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే ‘అమ్మో... దిశా చాలా హాట్ గాళ్’ అని అనుకోకుండా ఉండరు నెటిజన్లు. దిశా పెట్టే ఫొటోలు అంత గ్లామరస్‌గా ఉంటాయి. ఈ ‘హాట్ గాళ్’ ట్యాగ్ గురించి దిశాను అడిగితే...‘‘అబ్చే నేనంత హాట్ గాళ్‌ని కాదు. నిజజీవితంలో నేను టామ్ బాయ్‌లా పెరిగాను. నా ఫొటోషూట్ పిక్స్ కొంచెం గ్లామరస్‌గా ఉండడంతో ఆడియన్స్ అలా అనుకుంటున్నారు.. అంతే. నేను చాలా నార్మల్‌గా, సింపుల్‌గా ఉండే అమ్మాయిని’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం గురించి దిశా మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో నేను యాక్టివ్ యూజర్‌నని ఒప్పుకుంటాను. కానీ ఇంటర్‌నెట్‌కు అవతల కూడా మనకు ఓ లైఫ్ ఉందన్న విషయం తెలుసు. ఆ బ్యాలెన్స్ చూసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ చిత్రం ‘మలాంగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు దిశా పాట్నీ. అన్నట్లు.. ఇంత హాట్‌గా కనిపిస్తూ నేనంత హాట్ కాదు అని దిశా అనడమే చాలామందికి అర్థం కావడంలేదట.
Comments
Please login to add a commentAdd a comment