'నా జీవితంలో మాత్రం ట్రయాంగిల్ లవ్ లేదు' | Do not see love triangle happening in my life, says Ranveer singh | Sakshi
Sakshi News home page

'నా జీవితంలో మాత్రం ట్రయాంగిల్ లవ్ లేదు'

Published Mon, Dec 21 2015 2:58 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

'నా జీవితంలో మాత్రం ట్రయాంగిల్ లవ్ లేదు'

'నా జీవితంలో మాత్రం ట్రయాంగిల్ లవ్ లేదు'

హిస్టారికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాజీరావు మస్తానీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రణ్‌వీర్ సింగ్.. తన నిజ జీవితంలో మాత్రం అలాంటి అవకాశం లేనే లేదని స్పష్టం చేశాడు. జీవితం గురించి తనకు కావల్సినంత స్పష్టత ఉందని, ట్రయాంగిల్ లవ్ లాంటిది తన జీవితంలో పొరపాటున కూడా ఉండబోదని తెలిపాడు. దీపికా పదుకొనెతో రణ్‌వీర్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ జనాలు కోడై కూస్తున్న విషయం తెలిసిందే.

దాని విషయం ఏమీ చెప్పలేదు గానీ.. తాను మాత్రం అద్భుతమైన బోయ్ ఫ్రెండ్ అవుతానని అన్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన రామ్‌లీలా సినిమాలో కావల్సినంత రొమాన్స్ పండించిన ఈ జంట.. తరచు బయట పార్టీలలో క్లోజ్‌గా కనిపిస్తుంటారు. అయితే.. ఇద్దరిలో ఎవరూ ఈ బంధం గురించి బయటపడలేదు. బాజీరావు మస్తానీ సినిమాలో రణ్‌వీర్‌కు ప్రియురాలిగా దీపిక నటించిన విషయం తెలిసిందే. రణ్‌వీర్ ప్రస్తుతం ఆదిత్య చోప్రా దర్శకత్వంలో బేఫికర్ సినిమా చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement