
అంత ఖర్చుపెడుతున్నారా?
కథ మీద నమ్మకమో లేదా డైరెక్టర్ టాలెంట్ మీద నమ్మకమో లేదా హీరో రాజశేఖర్ పోలీస్‌గా నటిస్తే హిట్టనే నమ్మకమో... ‘íపీఎస్వీ గరుడ వేగ 125.18’కి 25 కోట్లు ఖర్చుపెడుతున్నారట.
కథ మీద నమ్మకమో లేదా డైరెక్టర్ టాలెంట్ మీద నమ్మకమో లేదా హీరో రాజశేఖర్ పోలీస్‌గా నటిస్తే హిట్టనే నమ్మకమో... ‘íపీఎస్వీ గరుడ వేగ 125.18’కి 25 కోట్లు ఖర్చుపెడుతున్నారట. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వర్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
‘‘కథకు తగ్గట్టుగా ఖర్చు పెడితేనే సినిమా బాగా వస్తుంది. అందుకే 25 కోట్లతో సినిమా తీస్తున్నాం. 60 శాతం షూటింగ్ పూర్తి అయింది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరించాం. సన్నీ లియోన్ ఐటెమ్ సాంగ్ బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల. సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శివాని శివాత్మిక ఫిలింస్.