
చిరు 150 సినిమా మొదలైంది..!
మెగా అభిమానులను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న చిరంజీవి 150వ సినిమా ఫైనల్గా పట్టాలెక్కేసింది.
మెగా అభిమానులను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న చిరంజీవి 150వ సినిమా ఫైనల్గా పట్టాలెక్కేసింది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలెట్టేశారు. దీంతో త్వరలోనే మెగాస్టార్ ముఖానికి రంగేసుకోనున్నారని అభిమానులు హ్యాపిగా ఫీల్ అవుతున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు.
ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన మెగా టీం, శుక్రవారం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవితో దిగిన సెల్పీ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ఈ ఫోటోతో పాటు 'చిరు 150వ సినిమా తొలి రోజు డిస్కషన్స్, వెల్ కం బ్యాక్ సర్' అంటూ ట్వీట్ చేశాడు.
With the BOSS !! #Megastar150 !!
On d 1st day of discussions !!
WELCOME bak Sirrrr !!! We Love You !!pic.twitter.com/0IQiSVCV2p
— DEVI SRI PRASAD (@ThisIsDSP) 13 May 2016