
ఘరానా దొంగతో..!
ఓ యువకుడు చోర కళలో ప్రావీణ్యుడు. కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చిక్కడు..దొరకడు. ఈ ఘరానా దొంగ ఎవరు...అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎవరు దొంగ’. నవీన్, ప్రియాంక జంటగా ఎస్.బాబ్జీ దర్శకత్వంలో ఎస్. చంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘దొంగ కథాంశంతో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం సాగుతుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ను త్వరలో చిత్రీకరించనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కపిల్ ఒరికూటి.