ముంబై: రామ్గోపాల్ వర్మ ఈసారి తన ట్వీట్లతో బాలీవుడ్ ఇండస్ట్రీ మీద పడ్డాడు. హాలీవుడ్ సినిమాలతో పోల్చితే మన బాలీవుడ్ టాలెంట్ ఎందుకూ పనికిరాదని తీర్మానించేశాడు. ఇండియాలో హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న వసూళ్లను ఆపడానికి బాలీవుడ్ గాంధీ ఎక్కడున్నాడంటూ ప్రశ్నించాడు. అంతే కాదు 'బ్రిటీషర్లను ఇండియా నుంచి తరిమేయడానికి ఒక్క గాంధీ సరిపోయాడు కానీ.. వందమంది బాలీవుడ్ గాంధీలు కలిసినా హాలీవుడ్తో పోరాడగలరా.. నాకు డౌట్గా ఉంది' అన్నాడు.
బడ్జెట్ను డబుల్ చేసి ఇచ్చినా కూడా హాలీవుడ్లో ప్రభంజనం సృష్టించిన అవతార్, ఇన్సెప్షన్, జంగిల్ బుక్ లాంటి చిత్రాలను మన హాలీవుడ్ గాంధీలు తీయలేరంటూ ఎద్దేవా చేశాడు. బాలీవుడ్లో 'అప్నా భారత్ మహాన్హై' అని చెబుతున్నారని, అమెరికాలో మాత్రం 'భారత్మే అప్నా హాలీవుడ్ మహాన్' అంటున్నారని చెప్పుకొచ్చాడు. చివరికి మన జాతీపిత 'గాంధీ' చిత్రాన్ని సైతం హాలీవుడ్ నిర్మించిందని.. 30 ఏళ్ల తరువాత సైతం మనం ఆ స్థాయికి చేరుకోలేకపోయామన్నారు. జంగిల్ బుక్ చేతిలో ఓడిపోకుండా షారుక్ను తన ఫ్యాన్స్కూడా కాపాడలేకపోయారని 'ఫ్యాన్' సినిమాపై సెటైర్లు వేశాడు రాము.
'బడ్జెట్ డబుల్ చేసినా అది మనోళ్లతో కాదు'
Published Sat, May 7 2016 6:19 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement