నజ్రియా ప్రేమకు గ్రీన్ సిగ్నల్
నజ్రియా ప్రేమకు గ్రీన్ సిగ్నల్
Published Wed, Jan 22 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
నటి నజ్రియా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడిందన్నది తాజా సమాచారం. తన పొట్ట చూపించారంటూ ఇటీవల నానా రభస చేసిన ఈ నటి నేరం చిత్రం ద్వారా కోలీవుడ్ కొచ్చింది. ఆ తరువాత నయ్యాండి, రాజారాణి చిత్రంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం జయ్‌తో తిరుమణం ఎన్నుం నిఖా చిత్రంతో పాటు బాలాజీ మోహన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తున్న ఈ భామ మలయాళంలోను నటిస్తూ బిజీగా ఉంది. మలయాళ యువ నటుడు పహత్ పాజిల్‌కు జంటగా ఎల్‌ఫర్ లవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఎల్‌ఫర్ లవ్ వీరిద్దరి మధ్య లవ్‌ను పుట్టించింది. వీరి గాఢ ప్రేమ ఇంట్లో తెలిసింది. ఇరు కుటుంబాల వారు నజ్రియా, పహత్‌ల పెళ్లికి పచ్చజెండా ఊపడం విశేషం.
అయితే తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడటంతో నజ్రియా ఇకపై ఎలాంటి వివాదాల్లోను చిక్కుకోనంటోంది. అదేవిధంగా నయ్యాండి వివాదం ఒక రకంగా తనకు ప్లస్ అయ్యిందని తద్వారా తాను గ్లామరస్‌గా నటించనని అందరికీ తెలిసిపోయిందని, ఇకపై తననెవరూ ఎక్స్‌పోజింగ్ చేయమని అడిగే సాహసం చేయరని అంటోంది. ఇంతుకు పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు నటిస్తున్న చిత్రాలు చాలా ఉన్నాయని, అవన్నీ పూర్తి చేసిన తరువాత పెళ్లి చేసుకుంటుందని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. పెళ్లి అనంతరం నజ్రియా నటిస్తుందా? లేదా? అన్న విషయం కూడా ఇంకా నిర్ణయించుకోలేదంటున్నారు. నజ్రియా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. నటుడు పహత్ ఇంతకు ముందు నటి ఆండ్రియాను తెగ ప్రేమించేసి ఆమె నిరాకరణకు గురయ్యారని ప్రచారం జరిగింది.
Advertisement
Advertisement