
సాక్షి, బొమ్మనహళ్లి: శాండల్‌వుడ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న అందాల సుందరి సంయుక్త హెగ్డే చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ఆమె నటించిన ‘కాలేజీ కుమార’ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ చేస్తున్న ప్రచారంలో హీరోయిన్ సంయుక్త హెగ్డే పాల్గొనలేదంటూ నిర్మాత పద్మనాభశెట్టి సినీ వాణిజ్య మండలికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ షూటింగ్ నుంచే నటి సంయుక్త ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉందని ఆరోపించారు. సినిమా ప్రచార కార్యక్రమాలకు ఆమె రావడం లేదని అన్నారు. ఈ ఇబ్బందులు మరొక నిర్మాతకు కలగరాదనే తాను ఈ విషయంపైన వాణిజ్య మండలికి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. సీనియర్ నటి శృతి మాట్లాడుతూ కళాకారులకు సినిమాల్లో నటించగానే మన పని అయిపోదని, సినిమా ముగిసే వరకు జరిగే ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని పేర్కొన్నారు.
నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు
నిర్మాత వ్యాఖ్యలపై స్పందించిన సంయుక్త.. తనకు కొంచెం అనారోగ్యం కారణంగా ప్రచార కార్యక్రమాలకు వెళ్ళలేదని.. ఇలాంటి చిన్న విషయానికి తన పైన లేని పోని ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో తానెవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment