అమితాబ్ ఫ్యామిలీ ప్యాక్ | First look: Amitabh Bachchan flaunts 'family-pack' in Piku | Sakshi
Sakshi News home page

అమితాబ్ ఫ్యామిలీ ప్యాక్

Published Fri, Oct 31 2014 11:50 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

అమితాబ్ ఫ్యామిలీ ప్యాక్ - Sakshi

అమితాబ్ ఫ్యామిలీ ప్యాక్

ఆరు పలకలు, ఎనిమిది పలకల దేహాలిప్పుడు ఫ్యాషన్. రెండు పదుల వయసున్న నటుల నుంచి ఆరు పదుల వయసున్న వారి వరకూ పాత్ర డిమాండ్ చేస్తే.... ఇలాంటి ప్యాక్‌ల కోసం కసరత్తులు చేస్తున్నారు. ‘పీకూ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా ప్యాక్‌లో కనిపిస్తారు. కానీ, ఇది సిక్స్ ప్యాక్ కాదు... ‘ఫ్యామిలీ ప్యాక్’. చిరు బొజ్జతో, నెత్తిన వెరైటీ టోపీతో అమితాబ్ కనిపించనున్నారు. మరి.. ఈ సినిమా కోసం అమితాబ్ బొజ్జ పెంచారా? లేక నకిలీదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న పాత్రలన్నీ వినూత్న తరహావే.
 
 ‘షమితాబ్’ చిత్రంలో నెరిసిన గడ్డం, జుత్తుతో కనిపించనున్నారు. అలాగే, ‘వాజిర్’ అనే చిత్రంలో చెస్ మాస్టర్‌గా నటిస్తున్నారు. ఇందులో వెరైటీ ఏముంది? అనుకోవచ్చు. కాళ్లు చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకి పరిమితమయ్యే చెస్ మాస్టర్ పాత్ర ఇది. ఏడు పదుల వయసులో అమితాబ్ ఇలా ఒకేసారి ఆహార్యంపరంగా వ్యత్యాసం చూపించే పాత్రలు చేయడం గొప్ప విషయం. ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కనిపించడంతో పాటు ‘యుద్ధ్’ అనే ధారావాహికలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇలా అలుపు సొలుపూ లేకుండా అమితాబ్ పని చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement