నాలుగు వారాల్లో.. నలుగురు మెగా హీరోలు | four mega hero's films releasing in four weeks | Sakshi
Sakshi News home page

నాలుగు వారాల్లో.. నలుగురు మెగా హీరోలు

Published Fri, Sep 11 2015 1:44 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

నాలుగు వారాల్లో.. నలుగురు మెగా హీరోలు

నాలుగు వారాల్లో.. నలుగురు మెగా హీరోలు

అక్టోబర్ నెలలో మెగా అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. నాలుగు వారాల గ్యాప్ లో నలుగురు మెగా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్లతో పాటు, రామ్ చరణ్, అల్లు అర్జున్లు కూడా ఈ గ్యాప్లోనే తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

అందరికంటే ముందుగా బరిలో దిగుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం సక్సెస్తో మంచి జోష్లో ఉన్న సాయి, హారీష్ శంకర్ డైరెక్షన్లో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్గా నటిస్తుంది.

సాయి థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత మరో మెగా హీరో వరుణ్ కూడా 'కంచె'తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గమ్యం ఫేం క్రిష్ దర్శకుడు. వరుణ్ సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నారు.

ఇక దసరా బరిలో సత్తా చాటడానికి రెడీ అవుతున్న మెగా హీరో రామ్చరణ్. గోవిందుడు అందరి వాడేలే సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న చెర్రీ మరోసారి అదే తరహా ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన 'బ్రూస్లీ' తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే  యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 15, 16 తేదిల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ డేట్ కన్ఫామ్ కాకపోయిన అక్టోబర్ లోనే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నమరో సినిమా 'రుద్రమదేవి. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చారిత్రక చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ అవుతుందని ప్రకటించినా, ఇంకా సందేహాలు మాత్రం ఉన్నాయి. ఇలా నలుగురు మెగా హీరోలు వరుస రిలీజ్లకు రెడీ అవుతుండటంతో అభిమానులు పండగ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement