ఉచితంగా హెల్త్‌ కార్డులు | Free health cards To TFCC | Sakshi
Sakshi News home page

ఉచితంగా హెల్త్‌ కార్డులు

Apr 25 2017 11:32 PM | Updated on Sep 5 2017 9:40 AM

ఉచితంగా హెల్త్‌ కార్డులు

ఉచితంగా హెల్త్‌ కార్డులు

తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) తృతీయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

– టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని
తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) తృతీయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడిగా జేవీఆర్, సెక్రటరీగా సాయి వెంకట్‌తో పాటు 23 మంది జనరల్‌ బాడీ మెంబర్స్‌ను ఎన్నుకుని, ప్రమాణస్వీకారం చేయించారు. అదే విధంగా తెలంగాణ మూవీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా సీనియర్‌ నటి కవితను, సెక్రటరీగా జెవీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 ఈ సందర్భంగా 100 మంది సినీ, టీవీ నటీనటులు, కార్మికులకు ఐదు లక్షల బీమాతో కూడిన కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ కార్డులు అందించారు. అనంతరం ప్రతాని మాట్లాడుతూ– ‘‘సినీ, టీవీ నటీనటులు, టెక్నీషియన్స్‌లో హెల్త్‌ కార్డుల కోసం తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌లో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా హెల్త్‌ కార్డులు, చదువుకునే పిల్లలకు స్కాలర్‌షిప్స్‌ ఇప్పిస్తాం. సభ్యులందరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement