కరణ్‌జోహార్ చేతిలో ఫ్రెంచ్ సినిమా | french cinema in karan johar | Sakshi
Sakshi News home page

కరణ్‌జోహార్ చేతిలో ఫ్రెంచ్ సినిమా

Published Thu, Jun 11 2015 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

french cinema in karan johar

ఫ్రెంచ్ చిత్రం ‘ఇన్‌టచ్‌బుల్స్’ త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనుందనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఆదిత్యారాయ్‌కపూర్ లేదా అర్జున్ కపూర్ ఈ  సినిమా రీమేక్‌లో నటించనున్నారని ఊహాగానాలు. ఈ ఉహాగానాలకు దర్శక-నిర్మాత  కరణ్ జోహార్  స్పందిస్తూ - ‘‘ఇంకా తారాగణాన్ని ఎంపిక చేయలేదు. ఈ  చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నేనే నిర్మించనున్నా’’ అని ట్వీట్ చేశారు. దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. తారాగణం, సాంకేతిక వర్గాన్ని త్వరలో ప్రకటిస్తాం. ఈ చిత్రంతో పాటు చేతన్ భగత్ నవల ‘హాఫ్ గార్ల్ ఫ్రెండ్’ ఆధారంగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement