సందీప్ మాధవ్
‘‘జార్జిరెడ్డి ఈ తరానికి తెలియకపోవచ్చు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. అలాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి నేటి తరం తెలుసుకునేలా ‘జార్జిరెడ్డి’ చిత్రం రూపొందించాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్‌లో ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘జార్జిరెడ్డి’. సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్ సినిమా పతాకాలపై మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘చరిత్ర మరచిపోయిన లీడర్’ అనే విషయాన్ని పోస్టర్‌లోనే చెప్పారు.
దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సమ సమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. ఎందరో విద్యార్థులను కదిలించిన విద్యార్థి నేత జీవితం వెండితెరపై చూపిస్తున్నాం. మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్లు: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, నేపథ్య సంగీతం: అర్జిత్ దత్తా.
Comments
Please login to add a commentAdd a comment