ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు | Glad to speak about child health at UN, Bollywood actress Kajol | Sakshi
Sakshi News home page

ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు

Sep 26 2014 9:39 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు - Sakshi

ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు

‘ఐదేళ్ల పిల్లల ఆరోగ్యంపై యునెటైడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో తాను మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి కాజోల్ అన్నారు

న్యూఢిల్లీ: ‘ఐదేళ్ల పిల్లల ఆరోగ్యంపై యునెటైడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో తాను మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి కాజోల్ అన్నారు. యూఎన్ సర్వసభ్య సమావేశాల్లో తాను మాట్లాడటం ఇది రెండోసారని ఆమె తెలిపారు. కాగా పిల్లల ఆరోగ్యంలో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా కీలకమని తాను చెప్పిన విషయం అందరికీ నచ్చిందన్నారు. ‘ఇక్కడ నా స్పీచ్‌కు నేను ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది..’అని గొప్పగా చెప్పారు. లైఫ్‌బాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘హ్యాండ్‌వాష్ క్యాంపైన్’లో భాగంగా ఆమె మాట్లాడారు. చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిన్నారులు డయేరియా వంటి అంటువ్యాధుల బారిన పడే అవకాశముందని ఆమె తెలిపారు.

 

‘చేతులు శుభ్రం చేసుకోవడమనేది చాలా ముఖ్యమైన, ప్రాథమికమైన అంశం.. అంటువ్యాధుల గురించి మాట్లాడే ప్రతిఒక్కరూ ఈ అంశం ప్రాధాన్యతను అర్థం చేసుకునే ఉంటారు. 0-2 ఏళ్ల లోపు పిల్లల్లో అధిక శాతం ఈ అంటువ్యాధుల బారిన పడుతున్నారు..’ అని కాజోల్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement