అక్షయ్, కరీనా, కియారా, దిల్జీత్
దుబాయ్‌లో ఉన్న అక్షయ్ కుమార్ అభిమానులకు ఓ తీపి వార్త. అదేంటంటే... అక్షయ్ నటించిన ‘గుడ్ న్యూస్’ చిత్రాన్ని మళ్లీ చూసే అవకాశం వారికి దక్కబోతోంది. గత ఏడాది డిసెంబర్ 27న ఈ చిత్రం విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు లాక్‌డౌన్ నేపథ్యంలో కొత్త సినిమాల విడుదల ఆగిన విషయం తెలిసిందే. ఇండియాలో మళ్లీ ఎప్పుడు సినిమా థియేటర్లు ఓపెన్ చేస్తారో తెలియదు. అయితే ఆ మధ్య చైనా ఓపెన్ చేసింది. కానీ ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో మూసేశారని తెలిసింది. దుబాయ్‌లో కూడా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ విడుదలైన సినిమాలనే మళ్లీ విడుదల చేయాలని అక్కడి థియేటర్లవారు నిర్ణయించుకున్నారట.
అలా విడుదల కానున్న చిత్రాల్లో ‘గుడ్ న్యూస్’ ఒకటి. ఈ నెల 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘నా సినిమాలను దుబాయ్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ లాక్‌డౌన్ సమయంలో నా సినిమా రీ రిలీజ్ కావడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది. ప్రేక్షకులను మరోసారి ‘గుడ్ న్యూస్’ ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు అక్షయ్ కుమార్. చిత్రనిర్మాతల్లో ఒకరైన అపూర్వ మెహతా మాట్లాడుతూ –‘‘థియేటర్‌లో సినిమాలు విడుదల కావడం అనేది ఓ పెద్ద కల అనే పరిస్థితిలో అన్నాం. ఇది ఊహించని పరిణామం. దుబాయ్ ప్రేక్షకులకు మా సినిమా కావాల్సినంత వినోదాన్ని ఇచ్చి, ఓ మంచి రిలీఫ్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment