
బాహుబలి 2 వీడియో లీక్ చేసిన కృష్ణ అరెస్ట్
బాహుబలి 2కు సంబంధించిన సన్నివేశాలు లీక్ చేసిన కృష్ణను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సినిమాకు వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న కృష్ణ, విజయవాడలోని 25 మంది ఫ్రెండ్స్‌కు ఈ సన్నివేశాన్ని లీక్ చేశాడు. మంగళవారం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవ్వటంతో అలర్ట్ అయిన చిత్రయూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పంధించిన పోలీసులు వీడియోను లీక్ చేసిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
బాహుబలి తొలిభాగం ఘనవిజయంసాధించటంతో సీక్వల్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈసినిమాను పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ లు కీలక పాత్రల్లో నటించిన బాహుబలి 2 భారతీయ చలన చిత్ర చరిత్రలో సరికొత్త రికార్డ్ లను ఆవిష్కరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.