హ్యాట్రిక్‌ హిట్‌ కిక్‌లో సమంత | HATRICK Hit For Tollywood Actress | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ హిట్‌ కిక్‌లో సమంత

May 11 2018 5:40 PM | Updated on Jul 14 2019 4:41 PM

 HATRICK  Hit For Tollywood Actress - Sakshi

సాక్షి,హైదరాబాద్‌:  టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత  ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఇటు తెలుగులో వరస హిట్స్‌, అటు తమిళంలో తాజా హిట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. రంగస్థలం హిట్‌, మహానటి సూపర్‌  హిట్‌,  ఇరుంబు తిరై   సక్సెస్ టాక్  ఇంతకంటే ఏ హీరోయిన్‌కైనా ఏం కావాలి. ఇదే  ఆనందాన్ని ట్విటర్‌ ద్వారా ఆమె వ్యక్తం చేశారు. టాలీవుడ్‌, కోటీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్ తో చాలా హ్యాపీగా ఉన్నానంటూ ట్వీట్‌ చేశారు. ఈ  సమ్మర్‌లో తనకు ఇంతకంటే ఏం కావాలి... ఈ ప్రపంచంలో  హ్యాపియస్ట్‌ అమ్మాయిని నేనే అంటూ  సమంత ట్వీట్ చేశారు. ఈ మూడు సినిమాలకి సంబంధించిన స్టిల్స్ ను పోస్ట్ చేశారు.

కాగా   చాలా తక్కువ గ్యాప్ లోనే అక్కినేనివారి కోడలు  సమంత వరుసగా మూడు సక్స్‌స్‌లను తన ఖాతాలో జోడించుకున్నారు. ముఖ్యంగా రాం చరణ్‌ హీరోగా ,  ఆమె నటించిన 'రంగస్థలం' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక  లేటెస్ట్‌ రిలీజ్‌'మహానటి'   గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. దీంతోపాటు తమిళంలో విశాల్ సరసన ఆమె చేసిన 'ఇరుంబు తిరై'  నేడు (శుక్రవారం) విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement