ఆరు నెలల క్రితం రష్మికా మందన్నా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఇకనుంచి మాంసాహారం తినకూడదు’ అనేది ఆ నిర్ణయం. ఎవ్వరైనా సరే జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. కానీ అమలు చేసే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతుంటాం. మరి.. రష్మికా సంగతి ఏంటి? నియమాన్ని ఫాలో అవుతున్నారా? అంటే.. ‘యస్’ అనే చెప్పాలి. ఆరు నెలలుగా ఆమె శాకాహారం మాత్రమే తీసుకుంటున్నారట. నిజానికి ఈ బ్యూటీకి నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. హీరోయిన్‌గా ఇప్పుడు ‘స్టార్’ హోదాలో ఉన్నారు రష్మికా. ఆ హోదా అలా కంటిన్యూ అవ్వాలంటే బాగా నటిస్తే మాత్రమే సరిపోదు... ఫిజిక్ చక్కగా ఉండాలి. కేలరీలు కేలరీలు లోపలికి పంపించేస్తే బరువు పెరగడం ఖాయం. అందుకే శరీరానికి ఎన్ని కేలరీలు కావాలో అన్నే తినడంతో పాటు వెజిటేరియన్ బెస్ట్ అనుకున్నారట. జీవితాంతం శాకాహారిగానే ఉండాలనుకుంటున్నారు. అయితే ఈ బ్యూటీ ఇటీవల మాంసాహారంతో పోజిచ్చిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అది ఓ యాడ్ కోసం ఇచ్చిన పోజ్. అంతే.. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘భీష్మ’ విజయంతో ఫుల్ జోష్‌గా ఉన్న రష్మికా ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment