
విడుదలకు ముందే భారీ అంచనాలు!
చెన్నై: దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన కొచ్చడయాన్ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. రజనీ సినిమా కోసం మూడేళ్ల ఎదురుచూపులను నిజం చేస్తూ కొచ్చాడియన్ చిత్రం ఈ ఎప్రిల్‌లో అభిమానుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్ కూతురు సౌందర్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించాలంటూ చెన్నైలో రజినీకాంత్ ఇష్ట దైవం అయిన రాఘవేంద్రస్వామిగుడిలో ఆయన అభిమానులు పూజలు నిర్వహించారు.
అంతేకాదు, సినిమా పరిశ్రమలో రజనీకాంత్ సన్నిహితులు, రజనీకాంత్‌తో ఉన్న అనుబంధం గురించే చెప్పే బుక్‌ను అభిమానులు విడుదల చేశారు. రజనీకాంత్‌కు దాదాపు 20కిపై కమర్షియల్ సెక్సెస్‌లు అందించిన దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఈ బుక్‌ను విడుదల చేశారు.