ఒక హిందు - ఒక ముస్లిం ప్రేమకథ | hindhu-muslim love story | Sakshi
Sakshi News home page

ఒక హిందు - ఒక ముస్లిం ప్రేమకథ

Published Tue, Oct 1 2013 11:46 PM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

ఒక హిందు - ఒక ముస్లిం ప్రేమకథ

ఒక హిందు - ఒక ముస్లిం ప్రేమకథ

 హిందువులంతా దేశభక్తులు, ముస్లిమ్‌లంతా దేశద్రోహులు కాదనే కథాంశంతో నవీన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఒక హిందు - ఒక ముస్లిం’. జీఎన్‌కె ప్రొడక్షన్స్, ఆర్మల్ మూవీస్ పతాకంపై నందిత నిర్మిస్తున్నారు. అక్షిత్ సేనాని, పల్లవి హీరో, హీరోయిన్లు. హైదరాబాద్‌లోని పాత బస్తీ, వైజాగ్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.
 
 ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఒక హిందూ యువకుడు, ఓ ముస్లిమ్ యువతి మధ్య సాగే ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది? అనే కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం.‘ఓరుగల్లు...’ అనే పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది.
 
 వచ్చే నెల 2 పాటలను, టీజర్‌ను, నవంబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, పవన్, భరత్, శివారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిట్టా, కెమెరా: ఇ.హెచ్.ఎస్.ప్రసాద్, సహనిర్మాతలు: జైహింద్‌గౌడ్-వెలగందుల శశిధర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement