లాస్ఏంజెల్స్ : హాలీవుడ్ ప్రముఖ నిర్మాత స్టీవ్ బింగ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. లాస్ ఏంజిల్స్ సెంచరీ సిటిలో నివసిస్తున్న స్టీవ్ తన అపార్ట్‌మెంట్లోని 27వ అంతస్థు నుంచి దూకి చనిపోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. కాగా గత కొంత కాలంగా బింగ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బింగ్ నిర్మాతతోపాటు రియల్ ఎస్టేట్ డెవలపర్. ఇతరులకు సాయం చేయడంలో ఎల్లప్పుడు ముందే ఉంటాడు. సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన యాక్షన్ చిత్రం గెట్ కార్టర్, అలాగే మార్టిన్ స్కోర్సెస్ మ్యూజిక్ డాక్యుమెంటరీ షైన్ ఎ లైట్, కామెడి సినిమా కంగారూ వంటి చిత్రాలను నిర్మించి మంచి పేరును సంపాదించారు. (బాధపడకండి.. నేను చనిపోవడం లేదు: నేహా)
2004లో విడుదలైన టామ్ హంక్స్ నటించిన ది పోలార్ ఎక్స్‌ప్రెస్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 80 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు స్టీవ్ బింగ్ చిరకాల స్నేహితుడు. తన 18 సంవత్సరాల వయస్సులో బింగ్ తన తాత, వ్యాపారవేత్త లియో ఎస్ బింగ్ నుంచి సుమారు 600 మిలియన్ల డాలర్ల సంపదను వారసత్వంగా పొందాడు. బింగ్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (నెపోటిజమ్‌పై తెలివిగా స్పందించిన సుస్మితా సేన్)
Comments
Please login to add a commentAdd a comment