
పొంబళ... అంటే ఏంటి?
‘అనామిక’, ‘మాయ’ తర్వాత నయనతార నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘దొర’. ఇది కాకుండా కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో చిత్రంలో నటిస్తున్నారామె. తాజాగా మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘పొంబళ’ పేరుతో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు బాలకుమార్ తెరకెక్కించనున్నారట. ఇందులో ఓ కీలక పాత్రను నమిత చేయనున్నారని సమాచారం. 2007లో రూపొందిన తమిళ ‘బిల్లా’లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ‘పొంబళ’లో కలసి నటించనున్నారన్న మాట. అవునూ.. ఇంతకీ ‘పొంబళ’ అంటే ఏంటో తెలుసా? ‘మహిళ’ అని అర్థం.