ఘాటైన ప్రేమకథ | Hot romance movie | Sakshi
Sakshi News home page

ఘాటైన ప్రేమకథ

Published Sun, Jul 26 2015 11:11 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఘాటైన ప్రేమకథ - Sakshi

ఘాటైన ప్రేమకథ

ఓ యువకుడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’. అభిజిత్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా జయనాగ్ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘లయన్’ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంది. తాజా చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’ని నందమూరి బాలకృష్ణగారికి చూపించాం.

ఆయనకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి, ఏమైనా మార్పులు చెబుతారనుకున్నాం. కానీ, ఆయనేం చెప్పలేదు. బాలయ్యకు చాలా బాగా నచ్చింది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు మాస్‌ను ఆకట్టుకుంటాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ప్రణయ సన్నివేశాలు యూత్‌ను గిలిగింతలు పెడతాయి. జేబీ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వీరబాబు, కెమెరా: ఆర్.ఎం.స్వామి, ఎడిటర్: ప్రవీణ్ పూడి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement