బాలకృష్ణకు యాప్ట్! | Balakrishna's LION releasing on May14 | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు యాప్ట్!

Published Sat, May 9 2015 11:56 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణకు యాప్ట్! - Sakshi

బాలకృష్ణకు యాప్ట్!

‘‘ఓ అభిమానిగా బాలకృష్ణగారితో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ తరహా చిత్రం నిర్మించాలనుకున్నాను. ఆ చిత్రాల్లా శక్తిమంతంగా ఉంటూనే, ఓ కొత్త కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని రుద్రపాటి రమణారావు అన్నారు. నందమూరి బాలకృష్ణ కథానాయకునిగా రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారధ్యంలో ఆయన నిర్మించిన చిత్రం ‘లయన్’.  జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సత్యదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
 
  ఈ సందర్భంగా రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ -‘‘మేం అనుకున్న విధంగా సినిమా బాగా వచ్చింది. రెండు కోణాలున్న పాత్రను బాలకృష్ణగారు బ్రహ్మాండంగా చేశారు. సమయపాలన విషయంలో ఆయన సూపర్బ్.  వాస్తవానికి బాలకృష్ణగారితో సినిమా తీయాలనుకున్న తర్వాత ఓ దర్శకుడితో కథ చెప్పించాను. కానీ, అది మామూలుగా ఉందనీ, వేరే కథ ప్రయత్నించమని అన్నారు. అప్పుడు సత్యదేవాని తీసుకెళ్లి, ఈ కథ చెప్పించాను. బాలకృష్ణగారికి అది నచ్చి, ఒప్పుకున్నారు.
 
 ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో వచ్చే ట్రైబల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ సినిమాలో హీరో పాత్ర పరంగా ‘లయన్’ అని పెడితేనే బాగుంటుంది. అటు సినిమానీ, ఇటు బాలకృష్ణగారి వ్యక్తిత్వాన్నీ దృష్టిలో పెట్టుకుని పెట్టిన టైటిల్ ఇది. బాలకృష్ణగారు 101వ సినిమా నిర్మించే అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement