వారి ఎఫైర్‌ నిజమేనా? ఫొటో లీక్‌తో దుమారం! | Hrithik Roshan and Kangana Ranaut were never in a relationship? This leaked photo proves otherwise | Sakshi
Sakshi News home page

వారి ఎఫైర్‌ నిజమేనా? ఫొటో లీక్‌తో దుమారం!

Published Tue, Apr 26 2016 3:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

వారి ఎఫైర్‌ నిజమేనా? ఫొటో లీక్‌తో దుమారం!

వారి ఎఫైర్‌ నిజమేనా? ఫొటో లీక్‌తో దుమారం!

ముంబై: హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లీగల్ వివాదం రోజురోజుకు వికృతరూపం దాలుస్తోంది. హృతిక్-కంగన 'ఎఫైర్' కు సంబంధించి అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వివాదంలో మొదటినుంచి హృతిక్ ఒకటే మాట చెప్తున్నాడు. తనకు కంగనతో వృత్తిపరమైన సంబంధమే కానీ, వ్యక్తిగత అనుబంధం లేదని, ఆమెతో ఎప్పుడూ తాను ప్రేమాయణం సాగించలేదని వాదిస్తున్నాడు.

తన లాయర్ ద్వారా కంగనకు ఇచ్చిన నోటీసులోనూ 'నేను, కంగన కలిసి రెండు చిత్రాల్లో నటించాం. మా మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉంది. అంతకుమించి సామాజిక, వ్యక్తిగత, ప్రేమ, సాన్నిహిత్య సంబంధం మా మధ్య లేనేలేదు' హృతిక్ స్పష్టం చేశాడు. అయితే, కంగన మాత్రం తమ డేటింగ్‌ సంబంధించి గట్టి ఆధారాలు ఉన్నాయని చెప్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆన్ లైన్ లో లీకైన ఓ ఫొటో హల్‌చల్‌ చేస్తోంది. కంగనను హృతిక్ ఆత్మీయంగా చుట్టుకొని ముద్దుపెడుతున్నట్టు ఉన్న ఈ ఘాటైన ఫొటో.. వీరి వివాదంలో మరింత ఆజ్యం పోసింది. క్రిష్ సినిమా ప్రి-ప్రొడక్షన్ సందర్భంగా ఓ ప్రవేటు పార్టీలో ఈ ఇద్దరు సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఈ ఫొటో తీసినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్లమీడియా వెల్లడించింది. అసలు కంగనతో తనకు వ్యక్తిగతంగా ఏ సంబంధం లేదంటున్న హృత్తిక్‌.. ఈ ఫొటోలో ఏం చేస్తున్నట్టు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఈ ఫొటో ఆధారంగా వీరిద్దరు డేటింగ్ చేశారా? అన్నది ఇదమిత్థంగా చెప్పలేమని ఈ వివాదాన్ని దగ్గర చూస్తున్న పరిశీలకులు అంటున్నారు. కానీ, ఈ ఫొటో మాత్రం హృతిక్-కంగన వివాదంలో కొత్త ట్విస్టు ఇచ్చింది. హృతిక్ చెప్తున్నట్టు కంగన ఒక్కరే వన్ సైడ్ లవ్ చేయలేదని ఈ ఫొటో వెల్లడిస్తున్నదని అంటున్నారు. రానురాను వీరి వివాదం, లీగల్ పోరాటం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement