ఆ సినిమాలో మా ఆవిడ అదుర్స్: మాధురి భర్త శ్రీరామ్ | Husband compliments Madhuri Dixit for 'Dedh Ishqiya' | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో మా ఆవిడ అదుర్స్: మాధురి భర్త శ్రీరామ్

Published Sat, Nov 9 2013 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

ఆ సినిమాలో మా ఆవిడ అదుర్స్: మాధురి భర్త శ్రీరామ్

ఆ సినిమాలో మా ఆవిడ అదుర్స్: మాధురి భర్త శ్రీరామ్

త్వరలో విడుదల కానున్న 'డేఢ్ ఇష్కియా' చిత్రంలో తన భార్య మాధురీ దీక్షిత్ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని ఆమె భర్త శ్రీరామ్ నెనె పొగడ్తల్లో ముంచెత్తాడు. మాధురీ దీక్షిత్, నసీరుద్దీన్ షా, హుమా ఖురేషి, అర్షద్ వార్సీ నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ శుక్రవారం ఆన్లైన్లో విడుదలైంది. ఈ సినిమాలో మాధురి బేగం పరా అనే ఓ డాన్సర్ పాత్ర పోషిస్తోంది. అందులో ఆమె చాలా అందంగా ఉండే, ప్రమాదకరమైన మహిళ.

డాక్టర్ నెనె తనను చాలా ప్రశంసించారని, పొగడ్తలలో ముంచెత్తారని, తాను సినిమా పోస్టర్లలోను, ప్రోమోల లోను అందంగా ఉన్నట్లు చెప్పారని మాధురి శుక్రవారం నాడు సనోఫి డయాబెటిస్ ఎవేర్నెస్ కార్యక్రమం సందర్భంగా విలేకరులకు చెప్పింది. మాధురి పిల్లలిద్దరూ కూడా ఈ సినిమా చూసి చాలా సంతోషించారు. వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని, ఎక్కడైనా తన ఫొటో కనిపించినా.. అమ్మా, నువ్వు ఈ ఫొటోలు ఉన్నావంటూ గోలగోల చేస్తున్నారని తెలిపింది. అభిషేక్ చౌబే దర్శకత్వంలో విశాల్ భరద్వాజ్ నిర్మించిన 'డేఢ్ ఇష్కియా' చిత్రం 2010లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'ఇష్కియా'కు సీక్వెల్. ఇది ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన చిత్రం. డేఢ్ ఇష్కియా చిత్రం వచ్చే సంవత్సరం జనవరి పదో తేదీన విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement