రాశీ... ఇక హైదరాబాదీ! | Hyderabad is home now: Raashi Khanna | Sakshi
Sakshi News home page

రాశీ... ఇక హైదరాబాదీ!

Published Sat, Apr 2 2016 10:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాశీ... ఇక హైదరాబాదీ! - Sakshi

రాశీ... ఇక హైదరాబాదీ!

‘‘నేను మీ తెలుగమ్మాయినే. హైదరాబాద్ నా సొంత ఊరు లాంటిదే’’ అని తెలుగు చిత్రాల్లో రాణిస్తున్న ఉత్తరాది భామలు అంటుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్ ఉన్నప్పుడు, చేసేసి కొంచెం గ్యాప్ వస్తే, తమ సొంత ఊరు వెళ్లిపోతారు. కానీ, హైదరాబాద్‌తో బాగా ఎటాచ్‌మెంట్ పెరిగిపోయి ఈ సిటీని వదల్లేని కథానాయికలూ ఉంటారు. దాంతో ఇక్కడే సెటిలైపోతారు. అలాంటివాళ్లల్లో రాశీఖన్నా ఒకరు. ‘ఊహలు గుసగుసలాడె’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
 
 ‘జిల్, శివమ్, బెంగాల్ టైగర్’... ఇలా వరుసగా పెద్ద సినిమాలు చేసిన రాశీ ప్రస్తుతం ‘సుప్రీమ్’, ‘ఆక్సిజన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. కథానాయికగా తెలుగు పరిశ్రమ తన ప్రతిభను గుర్తించి, అవకాశాలు ఇస్తున్నందు వల్ల, తెలుగు ప్రేక్షకులు తనను తమ అమ్మాయిలానే భావించడం వల్ల రాశీఖన్నా హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోవాలనుకున్నారు.
 
 ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారామె. ఇప్పుడు ఆచరణలో పెట్టేశారు. ఢిల్లీ నుంచి పూర్తిగా హైదరాబాద్‌కి మకాం మార్చేశారామె. ‘‘హోటల్‌లో బస చేస్తే ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండదు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే, ఇంటికి వస్తే ఆ రిలాక్సేషనే వేరు. హైదరాబాద్‌లో సెటిల్ కావాలనుకోవడానికి అదో కారణం. పెపైచ్చు, నాకు ఈ సిటీ బాగా నచ్చేసింది’’ అని రాశీ ఖన్నా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement