
అతడితో డేటింగ్ చేయలేదు: హీరోయిన్
యువ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేయడం లేదని హీరోయిన్ దిశా పటానీ తెలిపింది.
ముంబై: యువ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేయడం లేదని హీరోయిన్ దిశా పటానీ తెలిపింది. తామిద్దం మంచి స్నేహితులం మాత్రమేనని వెల్లడించింది. టైగర్ ష్రాఫ్ లో క్లోజ్ గా తిరిగినంత మాత్రానా అతడితో తాను డేటింగ్ చేస్తున్నట్టు కాదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్ పట్ల టైగర్ ఫ్రాష్ కు ఉన్న ఆసక్తి కారణంగానే తాను జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటుందన్న వాదనలో నిజం లేదని తెలిపింది.
టైగర్ బాగా డాన్స్ చేస్తాడని, అతడితో ఎవరూ డాన్స్ చేయలేరని ఆకాశానికెత్తేసింది. అతడు తప్ప బాలీవుడ్ లో తనకు స్నేహితులు లేరని చెప్పింది. ప్రియాంక చోప్రా తన రోడల్ మోడల్ అని వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలనుకున్నానని తెలిపింది. 'లోఫర్' తెలుగు సినిమాతో తెరంగ్రేటం చేసిన దిశా పటానీ... జాకీచాన్ తో కలిసి 'కుంగ్ ఫూ యోగా' నటించింది. ఆమె హిందీలో నటించిన 'ఎంస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' సెప్టెంబర్ 30న విడుదల కానుంది.