మేకప్ వేసుకోని రోజంటూ లేదు! | i ma make -up in three years says Rakul Preet Singh | Sakshi
Sakshi News home page

మేకప్ వేసుకోని రోజంటూ లేదు!

Published Fri, Apr 10 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

మేకప్ వేసుకోని రోజంటూ లేదు!

మేకప్ వేసుకోని రోజంటూ లేదు!

కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే మాటలతో రకుల్ ప్రీత్‌సింగ్ ఏకీభవిస్తున్నారు. కథానాయికగా ఆమె అరంగేట్రం ఓ చిన్న సినిమాతో మొదలైంది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబ నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాదు. కానీ, ప్రతిభ, కష్టపడే మనస్తత్వం రకుల్‌ని ఇప్పుడు ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్‌ని చేసేశాయి. ప్రస్తుతం ఈ ఢిల్లీ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. ఈ మూడేళ్లల్లో దాదాపుగా మేకప్ వేసుకొని రోజు ఒక్కటి కూడా లేదని రకుల్ అంటున్నారు. ఒకవేళ సినిమా చిత్రీకరణ లేకపోతే, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నారామె.
 
 ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్‌లో రకుల్ ముందుంజలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మాటలకు రకుల్ స్పందిస్తూ - ‘‘ఎవరైనా నా దగ్గరైన ఈ మాటలు అన్నప్పుడు ‘ధన్యవాదాలు’ చెబుతుంటాను. ఎందుకంటే, నాకీ స్థానం ఆయాచితంగా రాలేదు. సినిమా సినిమాకీ నటిగా వ్యత్యాసం కనబర్చుగలుగుతున్నాను. అలుపూ సొలుపూ లేకుండా షూటింగ్స్ చేస్తున్నాను. నా వృత్తి అంటే నాకు బోల్డంత అభిమానం ఉంది. దీనికోసం ఎంతైనా కష్టపడతా. ఆ కష్టాన్ని గుర్తించి, ఎవరైనా అభినందిస్తే ఆనందిస్తా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement