ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను! | I still get sleepless nights, says Taapsee Pannu | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను!

Published Tue, Jul 5 2016 5:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను! - Sakshi

ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'ఝుమ్మంది నాథం' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. రోయిన్గా స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. టాలీవుడ్ లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ రావడంతో కాస్త నిరాశ చెందింది. చష్మే బదూర్ మూవీతో బాలీవుడ్ బాట పట్టిన తాప్సీ అక్కడ మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఈ సొట్టబుగ్గల సుందరి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే ఒక్క అడుగు తప్పు వేసినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని  ఆందోళన చెందుతోంది.

బాలీవుడ్ లో సాధారణంగానే కాంపిటీషన్ అధికంగా ఉంటుందని, అందుకే సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానంటోంది. ఒక్క శాతం అనుమానం వచ్చినా సినిమాకు ఒకే చెప్పనని, అలాంటి మూవీలలో వర్క్ చేయనని చెప్పింది. ఆఫర్లు వెల్లువలా వచ్చిపడతాయి.. కానీ మంచి సినిమా ఎంచుకోవడానికి కాస్త సమయం తీసుకోవాలి. స్కూళ్లో ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్టు కోసం ఎలాగైతే ఎదురుచూస్తామో.. సినిమా విడుదలైనప్పుడు కూడా అది సక్సెస్ అవుతోందో లేదోనని ఇప్పటికీ నిద్ర లేని రాత్రులు గడపుతున్నానని తాప్సీ వివరించింది. బిగ్ బీ అమితాబ్ తో కలిసి నటిస్తున్న మూవీ సెప్టెంబర్ లో విడుదుల కానుందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement