చెర్రీ రంగస్థలంపై ఇంట్రస్టింగ్ న్యూస్ | intresting News on Ram Charan Rangasthalam | Sakshi
Sakshi News home page

చెర్రీ రంగస్థలంపై ఇంట్రస్టింగ్ న్యూస్

Published Thu, Jun 29 2017 3:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

intresting News on Ram Charan Rangasthalam

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈసినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో రంగస్థల కళాకరుడిగా కనిపించనున్నాడట.

అంతేకాదు తానే స్వయంగా రంగస్థలం అనే కంపెనీ పేరుతో నాటకాలు వేస్తుంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడట. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement