సినీ తారలపై కొండంత అభిమానాన్ని చూపించే ప్రేక్షకులే... ఒక్కోసారి అదే తారలతో చాలా ఇబ్బందిగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఇది కొత్త విషయమేం కాదు. పాత కాలంలో భానుమతి లాంటి గొప్ప నటికే అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పలేదు. ఈ తరంలో ఐశ్వర్యారాయ్, జ్యోతికలాంటి స్టార్లు కూడా ఫ్యాన్స్ నుంచి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు. ఇప్పుడు రీసెంట్‌గా కరీనాకపూర్ వంతు వచ్చింది. తన తాజా చిత్రం ‘గోరీ తేరే ప్యార్ మే’ ప్రమోషన్ నిమిత్తం ఆ చిత్ర కథానాయకుడు ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి జైపూర్‌లోని ఓ కాలేజ్‌కి వెళ్లారట కరీనా. అక్కడ స్టూడెంట్స్‌తో కలిసి ఆడిపాడి హడావిడి కూడా చేశారట. ఉన్నట్టుండి ఏమైందో ఏమో... అక్కడి స్టూడెంట్లు అత్యుత్సాహంతో రెచ్చిపోవడం మొదలుపెట్టారు.
కేరింతలతో, ఈలలతో గోల గోల చేస్తూ... కరీనాను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. దాంతో ఖంగు తినడం కరీనా వంతైంది. పోలీసులు, కరీనా బాడీగార్డులు, చివరకు బౌన్సర్లు కూడా చేతులెత్తేయడంతో కరీనాకు అక్కడ్నుంచీ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో కట్టలు తెగిన ఆవేశంతో విద్యార్థులపై చిందులు తొక్కేశారు కరీనా. ఈ క్రమంలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని సమాచారం. ‘‘నేను సినిమా హీరోయిన్‌ని మాత్రమే కాదు. ఓ స్త్రీని. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది. కళాకారులను గౌరవించే తీరు ఇదేనా. మీ గురువులు, తల్లిదండ్రులు మీకు నేర్పింది ఇదేనా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారట. అభిమానం హద్దుమీరితే ఇలాగే ఉంటుంది మరి.
కళాకారులను గౌరవించే తీరు ఇదేనా!
Published Tue, Nov 19 2013 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement