సిద్ధాంతాలే ఊపిరి! | Jagapathi Babu New Film Hitudu Movie | Sakshi
Sakshi News home page

సిద్ధాంతాలే ఊపిరి!

Published Wed, May 6 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

సిద్ధాంతాలే ఊపిరి!

సిద్ధాంతాలే ఊపిరి!

 సీతారాం అనే వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతాల గురించి ఏం చేశాడు? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘హితుడు’. జగపతిబాబు, మీరా నందన్ జంటగా  కేఎస్వీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ దర్శకుడు.  ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను  హైదరాబాద్‌లో విడుదల చేశారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘మాస్టర్, నక్సలైట్ పాత్రల్లో కనిపిస్తాను. ఇవి నాకు చాలా చాలెంజింగ్ రోల్స్. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘హీరో  విప్లవ్ తొలి ప్రయత్నమైనా  చాలా బాగా తీశారు. ఓ సామాజిక అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, సీవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement