భార్యా భర్తల జల్సా... | Jalsa Rayudu on sets from August 27th | Sakshi
Sakshi News home page

భార్యా భర్తల జల్సా...

Published Sun, Aug 17 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

భార్యా భర్తల జల్సా...

భార్యా భర్తల జల్సా...

శ్రీకాంత్ ‘జల్సారాయుడు’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎస్తేర్ ఇందులో కథానాయిక. సీహెచ్ సుధీర్‌రాజ్ దర్శకుడు. కొలన్ వెంకటేశ్ నిర్మాత. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టుగా నా పాత్ర ఉంటుంది. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. దర్శకుడు మంచి కథను తయారు చేసుకున్నాడు. సినీ నిర్మాణంపై చక్కని అవగాహన కలిగిన నిర్మాత వెంకటేశ్’’ అని తెలిపారు.
 
 దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ వినగానే వెంటనే శ్రీకాంత్ పచ్చజెండా ఊపేశారు. చక్కని కుటుంబ కథ ఇది. భార్యాభర్తల నేపథ్యంలో కథ సాగుతుంది. కథ రీత్యా ఇందులో ఇద్దరు హీరోయిన్లు. మరో కథానాయిక ఎంపిక జరుగుతోంది. చక్రి శ్రావ్యమైన స్వరాలను సమకూర్చే పనిలో ఉన్నారు. ఈ నెల 27న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. డిసెంబర్ 6న సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. వినోద భరితంగా సాగే సినిమా ఇదని నిర్మాత చెప్పారు. శ్రీకాంత్‌కి జోడీగా నటిస్తుండటం పట్ల ఎస్తేర్ ఆనందం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి మాటలు: విక్రమ్‌రాజ్, కెమెరా: కె.బుజ్జి, కూర్పు: ఉద్ధవ్ ఎస్.బి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement